Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

జాతి రత్నాలు‌ మూవీ రివ్యూ

నటీనటులు: నవీన్ పొలిషెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మజీ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు

బ్యానర్‌: స్వప్న సినిమా,

నిర్మాత‌: నాగ్ అశ్విన్,

ద‌ర్శ‌క‌త్వం: అనుదీప్ కె వి

ఎవడే సుబ్రహ్మణ్యం మరియు మహానటి తర్వాత స్వప్నాసినిమాస్ నిర్మించిన మూడవ చిత్రం జాతిరత్నాలు. సహజంగానే, స్వప్న సినిమాస్ పై ప్రేక్షకులు, జాతిరత్నాలు చిత్రంపై గణనీయమైన అంచనాలను కలిగి ఉంటారు. దర్శకుడు  నాగఅశ్విన్‌ జాతిరత్నాలు కథ యొక్క ఆలోచనను వినడానికి మరియు అలాంటి కథను చిత్రంగా తీర్చిదిద్దినందుకు సంతోషంగా ఉంది అనే విషయం ఈ చిత్రానికి మరింత హైప్ ఇచ్చింది. వీటన్నిటికీ మించి, బాహుబలి ది గ్రేట్ ప్రభాస్ మరియు రౌడీ హీరో విజయ్ దేవరకొండలు ఈ చిత్ర ప్రచారంలో చురుకుగా పాల్గొనడంతో, జాతిరత్నాలు ఎప్పుడు విడుదల అవుతాయో అన్ని అంచనాలు మొదలయ్యాయి. ప్రధమశ్రేణిలో జాతిరత్నాలు చిత్రం ఉందా లేదా అనేది అంచనాలకు సరిపోతుందా లేదా అనేది చూడాలి.

కథ

- Advertisement -

జోగిపేట అనే ఓ గ్రామంలో శ్రీకాంత్‌ అనే కుర్రాడు, వాడి ఇద్దరు ప్రెండ్స్ ఇద్దరు. ముగ్గురూ కలసి బలాదూర్‌గా ఊళ్ళో వాళ్ళవాళ్ళ తలిదండ్రులకి తలనొప్పి తెప్పించే పనులు చేస్తూ ఇష్టానికి తిరుగుతుంటారు. అందులో శ్రీకాంత్‌కి ఓ శారీ, మేచింగ్‌ గాజుల దుకాణం నడుపుతుంటాడు. కానీ శ్రీకాంత్‌కి ఆ ఆడంగి గుర్తింపు ససేమిరా ఇష్టం లేక హైదరాబాద్‌ వచ్చి, మెడలో టేగ్‌ వేసుకుని స్టయిల్‌గా అందరి యూత్‌లాగే ఉండాలన్నది తాపత్రయం. చివరికి రెండు నెలలలో హైదరాబాద్‌లో ఉద్యోగం సంసాదించి సెటిల్‌ అవుతానని, సంపాదించలేకపోతే మళ్ళీ జోగిపేట తిరిగొచ్చి శారీ సెంటరే నడుపుకుంటానని ప్రామిస్‌ చేసి మరీ హైదరాబాద్ ప్రయాణమవుతాడు. శ్రీకాంత్‌తో పాటు వాడికిష్టం లేకపోయినా కూడా ఇద్దరు ఫ్రెండ్స్ శ్రీకాంత్‌తో పాటు వెంటపడి మరీ హైదరాబాద్‌ వచ్చేస్తారు. తీరా వచ్చాక అసలైన తిప్పలు మొదలవుతాయి ముగ్గురికి. ఈ ప్రయాణంలోనే అనుకోకుండా ముగ్గురూ ఓ మర్డర్‌ కేసులో వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇరుక్కుంటారు. ఆ మర్డర్‌ కేసులోనుంచి ఎలా ముగ్గురూ బైటపడతారు అన్నదే కధా సారాంశం.

విశ్లేషణ

దర్శకుడు అనుదీప్‌ జాతిరత్నాలు చిత్రాన్ని ఫుల్‌ లెంత్ ఎంటర్‌టైనర్‌గానే మలచాలనుకున్న సంకల్పం పూర్తిగా నెరవేరింది. ఏ క్షణంలోనూ పిసరంతైనా బోర్ లేకుండా ప్రతీ సీనూ ఎంటర్‌టైన్‌మెంట్‌ మోతమోగిపోయింది. రాసుకున్న కథను అనుకున్న రీతిలో, కావాల్సినంత టెంపో మేయిన్‌టైన్ చేస్తూ, పకడ్బండీ స్క్రీన్‌ప్లేతో చాలా సక్సెస్‌ఫుల్‌గా ఆద్యంతం నడిపించగలిగాడు దర్శకుడు అనుదీప్‌.

ఈ తరం ప్రేక్షకులకి, ముఖ్యంగా మాస్‌ అండ్‌ యూత్‌ని టార్గెట్‌ చేసి తీసిన ఈ జాతిరత్నాలు టార్గెట్‌ని పవర్‌ఫుల్‌గానే కొట్టింది. అనవసరమైన ఊకదంటపుడు డైలాగులు గానీ, చేటభారతం సీన్లు గానీ లేకుండా ధియేటర్‌లో ఉన్న ఆ రెండున్నరగంటల వ్యవధి ఇట్టే గడిచిపోయేలా, అడియన్స్‌కి రియటైం రిలీఫ్‌నిచ్చింది జాతిరత్నాలు సినిమాలో ప్రతీ సీను, ప్రతీ డైలాగ్‌. బాగా సుపరిచితమైన నటులతో పాటుగా కొత్త ముఖాలు కూడా అక్కడక్కడ కనిపించినా, వాళ్ళలో కూడా అనుదీప్ పరకాయప్రవేశం చేసి, వాళ్ళ నుంచి మెరిటెడ్‌ పెరఫారమెన్స్‌ని రాబట్టాడు. దాని వల్ల సినిమా మొదటనుంచి చివరిదాకా ఎంతో ఆహ్లాదకరంగా రక్తి కట్టింది. ప్రతీ క్యారెక్టరూ రాణించింది. మొత్తానికి సినిమా వినోదాల విందు భోజనంలా, సకుటుంబ సపరివార సమేతంగా చూసే లేదా చూడదగ్గ చిత్రంగా ప్రేక్షకలను అకట్టుకుంది.

నటీనటులు…సాంకేతిక నిపుణులు

నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణలపైనే సినిమా అంతా రన్‌ అవుతుంది. ముగ్గురికి ముగ్గురూ పేరు పెట్టడానికి లేని విధంగా నటించారు. ఎవరి పాత్రలో వాళ్ళు ఇమిడిపోయి, మోస్ట్ నేచురల్‌ పెరఫారమెన్స్‌తో ఆడియన్స్‌ని నవ్వుల్లో ముంచెత్తారు అంటే అతిశయోక్తి కానేకాదు. ఇందులో మళ్ళీ నవీన్‌ పోలిశెట్టి మెయిన్‌ లీడ్‌ క్యారెక్టర్‌ కాబట్టి, సినిమా చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించడానికి ఎక్కువ బాధ్యత నవీన్‌ భుజాల మీదే పడింది. ఆ బాధ్యతని నవీన్‌ చాలా ఈజీగా నిర్వర్తించాడు. నవీన్‌ బాడీ లాంగ్వేజ్‌ గానీ, ఎక్స్‌ప్రెషన్స్‌గానీ, డైలాగ్‌ డెలివరీ గానీ వేటికవే జోగిపేట శ్రీకాంత్‌ క్యారెక్టర్‌కి బాగా సూటయ్యాయి.

ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ వారివారి పాత్రల పరిధి మేరకు ఎక్కడా ఏ లోటూ రానీయలేదు. కొత్త అమ్మాయి అయినప్పటికీ, ఫైరా కూడా తన వాటాను చక్కగా తీసుకువెళ్ళింది. మురళి శర్మ, బ్రహ్మజీ తదితరులు అనుభవజ్ఞులు అంత తేలికగా చేశారు. మొత్తం మీద తారాగణం పాత్రలకు సరిపోతుంది, పాత్రలు నటీనటులకు అనుకూలంగా ఉంటాయి. జాతిరత్నాలు సినిమా ఎంటర్టైన్మెంట్  ప్రేక్షకుల కావలసిన దాని కంటే ఎక్కువ ఉన్నది. సంగీతం విషయానికి వస్తే, చిట్టి పాట సినిమాకు ఒక జీవితం. ఉద్రిక్తత దృశ్యాలలో రికార్డ్ చేయడం కెమెరా పని రెండూ నాణ్యతను ప్రదర్శించాయి.

 

Leave A Reply

Your email address will not be published.