Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మంత్రికి, అధికార ఎమ్మెల్యేకు జైలు తప్పదా..?

నోరు ఉంది కదా అని ఆధారాలు లేని విమర్శలు, ఆరోపణలు చేస్తే.. అందరూ చంద్రబాబులే ఉండరు. ఏదోలే రాజకీయ నాయకులు విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. వాటిని పట్టించుకోవక్కర్లేదని కొంతమంది వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, పలు రాజకీయ పార్టీల ముఖ్యనేతలు చూసి చూడనట్లు వదిలేస్తుంటారు. ఆ విదంగా వదిలివేయటాన్ని చేతకాని తనంగా భావించి మరింత రెచ్చిపోతున్నారు అమాత్యులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డితో పాటు మంత్రులు, అధికార ప్రజాప్రతినిధులు, రాజ్యసభ సభ్యులు, అధికార ముఖ్యనేతలు ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మాజీ మంత్రి లోకేష్‍పై ఆధారాలు లేని విమర్శలు, ఆరోపణలు చేస్తూ బరి తెగించి రెచ్చిపోయారని టిడిపి నేతలు అంటుంటారు.

ఇంత వరకు ఎన్నో విమర్శలు, ఆరోపణలు భరించిన వారు పరువు నష్టం కేసు దాఖలు చేయకపోవటంతో తిట్టే నోరును అదుపులో పెట్టకుండా రెచ్చిపోతే అందుకు మూల్యం చెల్లించుకునే పరిస్థితులు ఎదురవుతాయని అనుభవంతో మంత్రి కన్నబాబుకు, అధికార ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు అరెస్టు వారెంటు అనుభవంతో తెలిసి వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళితే.. హెరిటేజ్‍ సంస్థ విషయంలో మంత్రి కన్నబాబుతో పాటు ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆధారాలు లేని విమర్శలు, ఆరోపణలు ఆ సంస్థపై చేయటంతో వారిద్దరిపై పరువు నష్టం కేసు హెరిటేజ్‍ సంస్థ దాఖలు చేసింది.

- Advertisement -

నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతున్న అటు మంత్రి కన్నబాబు కానీ ఇటు అంబటి రాంబాబు కానీ హాజరు కాకపోవటంతో శుక్రవారం వారిద్దరికి కోర్టు నాన్‍బెయిలబుల్‍ వారెంటు జారీ చేసింది. ఎవరైనా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఎన్నెన్ని పెండింగ్‍లో ఉన్నాయో.. వాటిని వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం విధితమే.

హెరిటేజ్‍ సంస్థపై చేసిన విమర్శలు, ఆరోపణలపై నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేసిన నేపధ్యంలో ఇప్పటికీ అనేక వాయిదాలు గడిచినా.. మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులు హాజరు కాకపోవటంతో నాన్‍బెయిలబుల్‍ వారెంటు ఇష్యూ చేయ టంతో వారిద్దరిని ఏ క్షణాన అయినా అరెస్టు చేసి వాయిదా రోజున కోర్టులో నిబందనల ప్రకారం హాజరు పరుస్తారు. కేసీఆర్‍తో జగన్‍కు సన్నిహిత సంబందాలున్న నేపధ్యంలో తెలంగాణ పోలీసులు అంత దూకుడుగా వ్యవహరించకపోవచ్చు.

మళ్లీ కోర్టు వాయిదా ఎప్పుడు వేశారో ఆ రోజుకు మంత్రి కన్నబాబు, అంబటి రాంబాబులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈసారి హాజరు కాకుంటే అరెస్టు చేసైనా కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం అదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి.

Leave A Reply

Your email address will not be published.