Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

చంద్రబాబుకు నాయకులు వెన్నుపోటు పొడిచినా…!

పార్టీ కోసం ప్రతిఫలం ఆశించకుండా పనిచేసిన ఎంతో మంది నాయకులను, కార్యకర్తలను చూశాం. తాజాగా పార్టీని నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను చూస్తున్నాం. నైతిక విలువల కోసం తృణపాయంగా త్యాగం చేసిన నాయకులున్న తెలుగుదేశంలో తాజాగా పదవుల కోసం పాకులాడే నాయకులు ఎక్కువైపోయారు. పార్టీని మోసం చేసి రాజకీయ, అదికార లబ్ది పొందిన నాయకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు అధికారం పంచటం కోసం ఏర్పాటైన తెలుగుదేశం పార్టీలో ఆ వర్గాలను మోసం చేస్తున్న నాయకులు ఎక్కువగా కనిపిస్తున్నారు.

ప్రజా సేవ చేసేందుకు, ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు తపన పడే నాయకులు ఉన్న తెలుగుదేశం పార్టీలో తాజాగా అందుకు భిన్నమైన మనస్తత్వం కలవారు ప్రవేశించారు. లక్షలు ఆశ చూపినా నమ్మిన పార్టీని వదలకుండా ఎన్నో కేసులు ఎదుర్కొన్న నాయకులు ఎందరో ఉన్న పార్టీలో తాజాగా ధనార్జనే ముఖ్యంగా పార్టీని నమ్ముకున్న నాయకులు ఎక్కువయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ, అధికార, ఆర్దిక లబ్ది పొందిన నేతలు తాజాగా కనిపించకుండా ముఖం చాటేస్తున్నారు. కొంత మంది స్వార్ద పరులైన రాజకీయ చెరలో పార్టీ బందీ అయిపోయింది.

- Advertisement -

ఈ స్వార్ద పరుల నాయకుల చర్యలు తెనె పూసిన కత్తులని పార్టీ నేత చంద్రబాబు కూడా గుర్తించలేకపోయారు. స్వచ్చమైన నాయకులను, కార్యకర్తలను తయారు చేసిన తెలుగుదేశం పార్టీలో తాజాగా వారిని తొక్కి పెట్టి స్వార్దపరులు, అవకాశవాదులు అటు చంద్రబాబు, ఇటు లోకేష్‍ బాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాజకీయ, అధికార లబ్ది పొందారు. తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలలో ఇంత ఘోర అవమానం జరగటం ఏమిటి..? ఎవరెవరు కారణం..? ఎవరెవరు అమ్ముడు పోతున్నారు…? ఎవరెవరు తెర వెనుకుండి వెన్నుపోటు పొడుస్తున్నారనే విషయం పార్టీ ముఖ్యనేతలందరికీ తెలుసు.

కానీ ఏ ఒక్కరూ అసలు విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లరు. తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్షించే పరిస్థితిలో లేరు. ఆ పార్టీని రక్షించేది చివరకు సానుభూతిపరులు, ఓటర్లే అని తాజాగా జరుగుతున్న సంఘటనలను బట్టి స్పష్టమవుతోంది. ఇంతకు ముందు అనేక సందర్భాలలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కారకులైన నాయకులు, కార్యకర్తలలో చాలా మంది కారకులయ్యారు.

వారి స్థానంలో తెరపైకి వచ్చిన వారు స్వార్దంతో అమ్ముడు పోయారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారంలోకి తీసుకు వస్తారన్న నమ్మకం కనుచూపుమేరలో కనిపించటం లేదు. చివరకు ఆ పార్టీ ఓటర్లు, సానుభూతిపరులే మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు నిజాయితీపరులైన కార్యకర్తలు.

Leave A Reply

Your email address will not be published.