Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మంత్రి పెద్దిరెడ్డితో మాజీ మంత్రి కుమ్మక్కు..!

చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా.. ఎంత తేలికగా చంద్రబాబును తీసివేస్తున్నా.. ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమరనాధ్‍ రెడ్డి మంత్రి వ్యాఖ్యలను ఖండించరు.. తప్పుబట్టరు..మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు చేస్తే.. తనకు ఏం సంబందం అన్నట్లుగా అమరనాద్‍ రెడ్డి తెలివిగా తప్పుకుంటున్నారని తెలుగుదేశం నేతలే అంటున్నారు.

మంత్రి రామచంద్రారెడ్డితో మాజీ మంత్రి అమరనాధ్‍ రెడ్డి పరోక్షంగా కుమ్మక్కైన మాట వాస్తవమేనని అందుకు నిదర్శనం ఏమిటంటే.. పుంగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి అమరనాధ్‍ రెడ్డి ఆయన తండ్రి దివంగత రామకృష్ణారెడ్డి అనేక దఫాలు ఎన్నికలలో విజయం సాధించిన విషయాన్ని స్థానిక నేతలు గుర్తుచేస్తున్నారు. పుంగనూరులో పట్టున్న మాజీ మంత్రి అమరనాధ్‍ రెడ్డి పంచాయితీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతుంటే ఏ కారణాలతో మౌనం వహించారు…? మంత్రి రామచంద్రారెడ్డితో మాజీ మంత్రి అమరనాధ్‍ రెడ్డికి తెర వెనుక ఉన్న సంబందాలు స్థానిక అధికార పార్టీ నేతలందరికీ తెలుసునని..ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసునని టిడిపి నేతలు అంటున్నారు.

- Advertisement -

పుంగనూరు మునిసిపాలిటీ, పుంగనూరులోని పంచాయితీ అధికార పార్టీకి ఏకగ్రీవం అవుతున్నా.. కళ్లున్న గుడ్డివాని వలె తనకు ఏమీ సంబందం లేనట్లుగా (మంత్రి రామచంద్రారెడ్డితో ఉన్న సంబందాలున్నాయని విమర్శలున్నాయి) మాజీ మంత్రి అమరనాధ్‍ రెడ్డి వ్యవహరిస్తున్నా.. పార్టీ నేత చంద్రబాబు పట్టించుకోవటం లేదు.

మాజీ మంత్రి లోకేష్‍ ఆ విషయంపై దృష్టి పెట్టలేదని..ఏకగ్రీవాలు జరుగుతున్నా.. అసలు కారణం తండ్రి కొడుకులకు తెలిసినా మాజీ మంత్రి అమరనాధ్‍ రెడ్డిని పిలిచి ఎందుకు మందలించటం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీకి పుంగనూరు నియోజకవర్గం టిడిపికి కంచుకోట అయినప్పటికీ.. మాజీ మంత్రి అమరనాధ్‍ రెడ్డి తెరవెనుక కుమ్మక్కు రాజకీయాలతో మంత్రి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గాన్ని అనుకూలంగా మలుచుకోవటమే కాకుండా ఆ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారనేది వాస్తవం అంటున్నారు టిడిపి నేతలు.

Leave A Reply

Your email address will not be published.