Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

బిజెపి ముఖ్యనేతకు గనులు బహుమతి..!

ఆయన రాష్ట్రానికి చెందిన బిజెపి ముఖ్యనేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ఆ బిజెపి నేతకు సరిపడదు. చంద్రబాబుపై ఉన్న కోపంతోనే సిఎం జగన్‍ రెడ్డి తీరును ఆ బిజెపి నేత ప్రశంసిస్తుంటారు. అధికారం కోల్పోయాక కూడా చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు చేసే ఆ బిజెపి ముఖ్యనేతకు ఒక మంత్రి ద్వారా భారీగా బహుమతి అందిందని ప్రచారం జరుగుతోంది.

రాబోయే కాలం లో కాబోయే రాజులం… అని చెప్పుకుంటున్న ముఖ్యనేతకు వాస్తవ పరిస్థితులు అనుభవంతో తెలియటంతో దీపం ఉండగానే.. ఇల్లు ఎలా సర్దిపెట్టుకోవాలా అని తాపత్రయ పడుతున్నారు.ఆ విషయం తెలిసిన మంత్రి ఒకరు.. ఒక మాజీ మంత్రి సమీప బందువుకున్న గనులలో ఒక గని ని ఆ బిజెపి ముఖ్యనేతకు  ఇప్పించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

- Advertisement -

ఏదో విధంగా ఆర్దిక పరంగా ఎదగాలని ఆశిస్తున్న ఆ బిజెపి ముఖ్యనేత పనులన్నీ సిఎం జగన్‍ రెడ్డికి సన్నిహితుడైన మధ్య వర్తి ద్వారా జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులు చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు చేసిన ఆ బిజెపి ముఖ్యనేత ఆ తరువాత గొంతు సవరించుకున్నారు. సిఎం జగన్‍ రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.

ప్రభుత్వ పనితీరును తప్పుబట్టారు. మళ్లీ ఇంతలో ఏం జరిగిందో కానీ అటు చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు చేయటం తగ్గించారు. ఇటు సిఎం జగన్‍ రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేయకుండా తెర వెనుక పనులను లౌక్యంగా ఆ బిజెపి నేత చక్కపెట్టుకుంటున్నారని బిజెపి నేతలే తెర వెనుక తమ సన్నిహితులతో చెబుతూ… మా వాడు దీపం ఉండగానే ఇల్లు సర్దుకుంటున్నట్లుగా తాజాగా జరిగిన సంఘటనలను బట్టి సష్టమవుతున్నాయంటున్నారు బిజెపి నేతలు.

జాతీయ అధిష్టానం కూడా మా వాడి పనితీరుపై సంతృప్తిగా లేరు. అందుకేనేమో ఇటీవల కాలంలో దూకుడు తగ్గించి ఆర్దిక లబ్దికి సంబందించిన పనులు చక్కపెట్టుకుంటున్నట్లుగా మాకు అనుమానం ఉందన్నారు బిజెపి నేతలు..

Leave A Reply

Your email address will not be published.