Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మంత్రి బొత్స బిజెపిలో చేరాలనుకుంటున్నారట..!

ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి పట్టించుకోవటం లేదు. మునిసిపల్‍ శాఖాదిపతి శ్రీలక్ష్మీ ఖాతరు చేయటం లేదు. ముఖ్యమంత్రిని కలిసేందుకు సమయం కోరినా ఇవ్వటం లేదు. మునిసిపల్‍ పన్నుల పెంపు వివరాలను మంత్రి చెప్పాల్సి ఉన్నప్పటికీ.. విశాఖ నగరంలో తిష్ట వేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డే చెబుతన్నారు. మంత్రిగా నాకు మిగిలింది ఏమిటి..? నిదుల కొరత అధికంగా ఉంది. పదేళ్లు కాంగ్రెస్‍ ప్రభుత్వ హయాంలో అదికారం చెలాయించి గుర్తింపు తెచ్చుకున్నారు.

జగన్‍ రెడ్డి పార్టీలో చేరి తప్పు చేశానా అని ఆ మంత్రి తాజాగా భావిస్తున్నారట. అధికార పార్టీలో ఉండి సాధించింది ఏమిటి..? మంత్రి పదవితో పొందుతున్న లాభం ఏమిటి అని ఆ మంత్రి అధికార పార్టీని వీడి బిజెపిలో చేరేందుకు ఆ పార్టీ ముఖ్యనేతలతో రహస్యంగా చర్చలు జరిపారని అటు సోషల్‍ మీడియాలో మూడు నాలుగు రోజుల నుండి ప్రచారం జరుగుతోంది.. ఇటు కొన్ని టివి ఛానెళ్లలో ఆ మంత్రి పార్టీ మార్పుపై చర్చలు కూడా జరుగుతున్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే.. ఆ మంత్రి పేరు బొత్స సత్యనారాయణ. ప్రాధాన్యత గల మునిసిపల్‍ శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా..ఆ శాఖాదిపతి శ్రీలక్ష్మీ ఆయనను ఖాతరు చేయకపోవటం బాధను కలిగించింది. సిఎం జగన్‍ రెడ్డి ఆశీస్సులు తనకు ఉన్నాయని.. తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని శ్రీలక్ష్మీ భావిస్తున్నారా..? ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి అండదండలతో మునిసిపల్‍ శాఖాదిపతి శ్రీలక్ష్మీ రెచ్చిపోతూ.. మంత్రి బొత్ససత్యనారాయణను తేలికగా తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

అధికార పార్టీలో కొనసాగుతూ అవమానాలు పొందేకన్నా.. పార్టీ మారితే రాజకీయ భవిష్యత్తు మిన్నగా ఉంటుందని మంత్రి బొత్స భావిస్తున్నారట. అటు తెలుగుదేశం పార్టీలో చేరలేరు. ఒకవేళ చేరాలనుకున్నా.. అశోక్‍ గజపతిరాజు అడ్డుపడతారు. ఆయన్ను కాదని.. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోరు. ఇక జాతీయ స్థాయిలో బిజెపి బలంగా ఉంది. ఆ పార్టీలో చేరితే.. రాజకీయ అధికార లబ్ది పొందవచ్చునని.. బొత్స నమ్మకమట.

బొత్స బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో.. కొంత మంది ఎమ్మెల్యేలు తాము కూడా బిజెపిలోకి వస్తామని మంత్రి బొత్సతో సంప్రదింపులు జరుపుతున్నారట. పార్టీకి విధేయతగా ఉన్నాను. 2019 ఎన్నికలలో జిల్లాలో టిడిపికి సింగిల్‍ సీటు కూడా రాత్రింబవళ్లు కష్టపడ్డాను.. మునిసిపల్‍ శాఖకు మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి అటు జిల్లాలో ఇటు ఆ శాఖలో తన పెత్తనం నడవకుండా.. కొతమంది వ్యక్తుల ద్వారా సిఎం జగన్‍ రెడ్డ్డి వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్సకు అనుమానం ఉంది.

పదే పదే అవమానాలు జరుగుతున్నాయి. ఓర్పుతో నేర్పుతో నెట్టు కొస్తున్నాను. ఇంకెన్నాళ్లు అవమానాలను బరించాలి. పెత్తనమంతా వేరే వారు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల స్పష్టంగా ఎదురువుతున్న నేపధ్యంలో అధికార పార్టీని వీడి బిజెపిలో చేరి సిఎం జగన్‍ రెడ్డిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించాలనుకుంటున్నారట మంత్రి బొత్స సత్యనారాయణ.

Leave A Reply

Your email address will not be published.