Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మునిసిపాలిటీలలో మంత్రులు విజయం సాధించకుంటే…!

మునిసిపల్‍ ఎన్నికలలో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న మునిసిపాలిటీలలో తాము విజయం సాధించకుంటే.. పదవులు కోల్పోవలసి వస్తుందని పలువురు మంత్రులు భావిస్తున్నారు. మీరు మంత్రి పదవిలో ఉండాలంటే.. మునిసిపాలిటీలలో తప్పనిసరిగా విజయం సాదించాల్సిందే అని సిఎం జగన్‍ రెడ్డి తరపున ఆయనకు అత్యంత సలహాదారుడిగా ప్రచారం ఉన్న సజ్జలరామకృష్ణారెడ్డి వారికి హుకుం జారీచేశారట.

2019 ఎన్నికలలో చంద్రబాబుపై వ్యతిరేకతతో తాము ఎమ్మెల్యేలుగా విజయం సాదించి మంత్రులయ్యాం. తాజాగా సిఎం జగన్‍ రెడ్డిపై వ్యతిరేకత ఇప్పుడిప్పుడే బయట పడుతుంది.ఆ ప్రభావం మునిసిపల్‍ ఎన్నికలలో పడితే మేము మాత్రం ఏం చేయగలుగుతాం అని కొందరు మంత్రులు తెలివిగా, లౌక్యంగా వ్యవహరిస్తున్నారట.

ఇక అసలు విషయానికి వస్తే.. బందరు మునిసిపాలిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పేర్ని నానికి అక్కడ తాజా పరిస్థితులు వ్యతిరేకంగా కనిపిస్తున్న నేపధ్యంలో ఏదో విధంగా మునిసిపాలిటి డివిజన్లలో మెజార్టీ అభ్యర్ధులు విజయం సాదించేందుకు పేర్ని నాని చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలించనున్నాయో.

- Advertisement -

అదే విధంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ మునిసిపాలిటీలో మెజార్టీ అభ్యర్ధులను గెలిపించుకోలనన్న ధీమా మంత్రి కొడాలి నానిలో కనిపిస్తుంది. గుడివాడలో బలమైన తెలుగుదేశం నాయకులు లేని నేపధ్యంలో మంత్రి కొడాలి నానికి కలిసి వచ్చే అవకాశాలున్నాయి.

అదే విధంగా రామచంద్రాపురం మునిసిపాలిటీలో మెజార్టీ డివిజన్లలో విజయం సాదించకుంటే మంత్రి వేణుగోపాల్‍కు రాజకీయంగా కష్టాలు ఎదురుకాక తప్పదు.

ఒంగోలు మునిసిపాలిటీని అవలీలగా కైవసం చేసుకుంటానన్న ధీమాతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కనిపిస్తున్నారు.

అంతే కాకుండా మరి కొంత మంది మంత్రులకు కూడా మునిసిపల్‍ ఎన్నికల ఫలితాలను బట్టి తమ పదవులు ఉంటాయో ఊడతాయో అన్న ఉత్కంఠతో కనిపిస్తున్నారట. ఏ మంత్రిని కదిలించినా.. మునిసిపాలిటీని తప్పనిసరిగా కైవసం చేసుకుంటామని చెబుతున్నారంటే..అక్కడ విపక్షాల నాయకులు బలంగా లేరని.. నామ మాత్రపు పోటీయే తప్ప బలమైన పోటీ లేదని వారి మాటలను బట్టి స్పష్టమవుతోంది.

Leave A Reply

Your email address will not be published.