తిరుపతిలో గెలుపు కన్నా.. మెజార్టీ తగ్గించటమే మిన్న…!
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో గెలిచే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయనే విషయం పక్కన పెడితే.. అధికార పార్టీ అభ్యర్ధికి 2019లో వచ్చిన రెండు లక్షల 28వేల మెజార్టీని సగం వరకు తగ్గించగలిగితే.. నైతికంగా టిడిపి అభ్యర్ధి గెలిచినట్లే.. అధికార పార్టీ అభ్యర్ధి ఓడినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు లక్ష లనుండి 5లక్షల మెజార్టీ తప్పనిసరిగా రావాల్సిందే అని అధికార ఎమ్మెల్యేలు, అమాత్యులకు టార్గెట్ విధించిన జగన్ రెడ్డి ఆ టార్గెట్ కన్నా గతంలో వచ్చిన మెజార్టీ నిలుపుకుంటే చాలు అన్నట్లుగా స్వయంగా సిఎం జగన్ రెడ్డే ఎన్నికల ప్రచార రంగంలోకి దిగబోతున్నారు.
జనసేనాదిపతి పవన్ కళ్యాణ్ ప్రచారంతో బిజెపి అభ్యర్దికి ఎన్ని ఓట్లు పోలవుతాయనే విషయం చెప్పలేకపోతున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్దికి గతంలో కన్నా ఎక్కువ ఓట్లు పోలవుతాయా.. తక్కువ ఓట్లు పోలవుతాయా అనే విషయం పక్క పె డితే.. అధి•కార పార్టీ అభ్యర్ధికి వచ్చిన 3లక్షల మెజార్టీకి ఈసారి బొక్క పడే అవకాశం ఉందని.. అధికార పార్టీ ప్రతినిధులు, అమాత్యులే తెర వెనుక చెబుతున్నారు.
- Advertisement -
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లకూడదనుకున్న జగన్రెడ్డి ఈ నెల 14వ తేదీ నుండి పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా ప్రచారం చేయబోతున్నారు. ఇప్పటికే తిరుపతి లోక్సభ పరదిలోని పలు నియోజకవర్గాలలో మాజీ మంత్రి లోకేష్ బహిరంగ సభలు నిర్వహిస్తూ.. కార్యకర్తలలో నూతన ఉత్తేజాన్ని పెంచుతున్నారు.
చంద్రబాబు పర్యటన కూడా ప్రారంభం కావటంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరింత జోరుగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని..కానీ అధికార పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు ఎవరూ ఎన్నికల ప్రచారంలో కనిపించటం లేదని.. ఎక్కడో ఏదో లోపం జరిగిందని.. స్థానిక అధికార నేతలు అంటున్నారు.
తిరుపతి ఉప ఎన్నికలో జగన్ పార్టీ అభ్యర్ధి విజయం సాధించటం ఖాయం. గతంలో కన్నా ఇంకా ఎక్కువ మెజార్టీ అభ్యర్ధికి వస్తుందని.. మంత్రులు, అధికార ప్రజాప్రతినిధులు చెబుతుండగా.. మాపార్టీ అభ్యర్ధి ఎన్నికలలో విజయం సాధించలేరని మాకు తెలుసు.. అధికార పార్టీ నేతలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. కనీసం గతంలో వచ్చిన మెజార్టీని తగ్గించగలిగితే.. పరోక్షంగా అధికార పార్టీ అభ్యర్ధి ఓడినట్లే.. మా పార్టీ అభ్యర్ధి విజయం సాధించినట్లేనని టిడిపి నేతలు అంటున్నారు.