Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఎంపీటిసి, జడ్పీటిసి ఎన్నికలు నిమ్మగడ్డ హయాంలో జరగనట్లేనా..?

మరో 25రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల కమీషనర్‍ నిమ్మగడ్డ పదవీకాలం పూర్తవుతున్న నేపధ్యంలో కోర్టులో కేసు పెండింగ్‍లో ఉన్న కారణాలతో జడ్పీటిసి, ఎంపీటిసి ఎన్నికలు రమేష్‍కుమార్‍ హయాంలో జరిగే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పంచాయితీ ఎన్నికలు జరిపించి విపక్షాల నేతల ప్రశంసలు పొందిన నిమ్మగడ్డ మూడో విడత, నాలుగో విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్‍లో జరిగిన అధికార నేతలు దౌర్జన్యాలు, బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడినట్లు ఆధారాలున్నా.. సకాలంలో నిమ్మగడ్డ స్పందించకపోవటం వెనుక ఏదో జరిగిందని.. విపక్షాల నేతలందరూ రమేష్‍కుమార్‍ను తప్పుబట్టారు.అంతే కాకుండా మునిసిపల్‍ ఎన్నికలకు కొత్త షెడ్యూల్‍ జారీ చేయకుండా రీ షెడ్యూల్‍ జారీ చేయటం వెనుక నిమ్మగడ్డ ఒత్తిళ్లకు తలొగ్గారని విపక్షాల నేతల ఆరోపించారు.

- Advertisement -

గతంలో జరిగిన దౌర్జన్యాలు తాజాగా జరుగుతున్న బలవంతపు ఏకగ్రీవాలను కళ్లకు కనిపించే విధంగా మీడియా ప్రచారం చేస్తున్నా.. ఆధారాలతో పత్రికలు కధనాలు ప్రచురిస్తున్నా… చర్య తీసుకునేందుకు నిమ్మగడ్డ వెన••డుగు వేయటంపై తెరవెనుక ఏం జరిగిందో అన్న అనుమానాలు వ్యక్తం చేశారు రాజకీయ విశ్లేషకులు. ఆంధ్ర టిఎన్‍.శేషన్‍గా పేరు తెచ్చుకున్న నిమ్మగడ్డ.. ఈ మధ్య కాలంలో ఆయన వ్యవహారశైలిలో చాలా మార్పులు చేర్పులు కనిపించటంతో ఆయనను ఏపీ టిఎన్‍.శేషన్‍గా సంబోదించి గౌరవించి తప్పుచేశామంటున్నారు విపక్షాలనేతలు.

ఇన్ని ఆరోపణలు, విమర్శలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపధ్యంలో ఎంపీటీసి, జడ్పీటిసి ఎన్నికలు తన హయాంలో నిర్వహించాలనుకున్న నిమ్మగడ్డ ఆ ఎన్నికలు నిర్వహించేందుకు వెనకడుగు వేశారని ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పంచాయితీ ఎన్నికలలో దౌర్జన్యాలు జరిగినా.. ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉన్న నిమ్మగడ్డ మళ్లీ మళ్లీ విమర్శలు, ఆరోపణలు కొని తెచ్చుకోవటం ఇష్టం లేక ఎంపీటీసి, జడ్పీటిసి ఎన్నికలు తన హయాంలో నిర్వహించకూడదని నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నిమ్మగడ్డ హయాంలోనే ఎంపీటిసి, జడ్పీటిసి ఎన్నికలు కూడా నిర్వహించి ఆయనను మరింత భ్రష్టు పట్టించాలని అధికార నేతలు పన్నుతున్న కుయుక్తులను రమేష్‍కుమార్‍ తెలుసుకోలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సహకరించకపోవటం తన ఆదేశాలను పాటించకపోవటం వంటి కారణాలు ఇటు మునిసిపల్‍ ఎన్నికల సందర్భంగా అనుభవంతో ఎదురుకావటంతో ఆ ఎన్నికలు నిర్వహించినా ఇదే పరిస్థితి కొనసాగుతుందని..ఎన్నికలు నిర్వహించటం ఇష్టంలేదని ఇటీవల ఆయన చేసినవ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోందంటున్నారు విపక్షాల నేతలు.

Leave A Reply

Your email address will not be published.