Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

జనసేన నుండి నాదెండ్లకు ఉద్వాసన..?

గతంలో సిఎం జగన్‍ రెడ్డి నోటి నుండి ఎలాంటి కులపరమైన విమర్శలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు బయటకు వచ్చాయో.. తాజాగా జనసేనాదిపతి పవన్‍ కళ్యాణ్‍ నోటి నుండి అలాంటి వ్యాఖ్యలే బయటకు దొర్లాయి. ఏ సామాజికవర్గాన్ని సిఎం జగన్‍ రెడ్డి ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తారో.. అదే సామాజికవర్గంపై పవన్‍ కళ్యాణ్‍ కూడా అంతే వ్యతిరేకంగా ఉన్నారని.. ఆయన నోటి నుండి దొర్లిపడ్డ వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది.

నాకు కులాభిమానం లేదు. అన్ని కులాల వారిని సమానంగా చూస్తాను అని పదే పదే వ్యాఖ్యనించిన పవన్‍ కళ్యాణ్‍ కూడా ఒక సామాజికవర్గంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి సంచలనానికి తెరలేపారు. శాసనసభ మాజీ స్పీకర్‍, జనసేన నేత నాదెండ్ల మనోహర్‍ పార్టీని వీడతారనే అనుమానం పవన్‍ కళ్యాణ్‍కు వచ్చిందా.. ఆయన పార్టీ మారాలనుకుంటున్నారా.. అనే విషయంపై పలు అనుమానాలున్నప్పటికీ.. తాజాగా జనసేనాదిపతి పవన్‍ కళ్యాణ్‍ చేసిన వ్యాఖ్యలు నాదెండ్లను ఉద్దేశించినవా.. మరేదైనా కారణాలతో పవన్‍ కళ్యాణ్‍ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారా..? పవన్‍ కళ్యాణ్‍ నోటి నుండి అలాంటి వ్యాఖ్యలు రావటంతో జనసేన ముఖ్య నేతలతో పాటు పవన్‍ కళ్యాణ్‍కు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు కూడా ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలోనే పవన్‍ కళ్యాణ్‍ నోటి నుండి ఆ వ్యాఖ్యలు వెలువడటంతో పక్కనే ఉన్న నాదేండ్ల మనోహర్‍ కూడా షాక్‍కు గురయినట్లు జనసేన నాయకులు చెప్పుకుంటున్నారు. ఏ వ్యాఖ్యలైతే పవన్‍ కళ్యాణ్‍ నోటి నుండి తాము వినకూడదని నాదెండ్ల మనోహర్‍తో పాటు జనసేన నాయకులు అనుకున్నారో.. అలాంటి వ్యాఖ్యలు పవన్‍ కళ్యాణ్‍ నోటి నుండి బయటకు వచ్చాయి.

ఇంతకీ పవన్‍ కళ్యాణ్‍ ఏ వ్యాఖ్యలు చేశారంటే.. ఒక సామాజికవర్గానికి చెందిన వారు ఒకసారి అధికారం లేకుంటే బాధపడుతున్నారని.. పరోక్షంగా నాదెండ్ల మనోహర్‍ను ఉద్దేశించి పవన్‍ కళ్యాణ్‍ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక ప్రచారంలో కులపరమైన వ్యాఖ్యలు పవన్‍ కళ్యాణ్‍ నోటి నుండి వెలువడటం ఏమిటి..? ఆయనకున్న సిద్దాంతాలు, అభిప్రాయాలు పక్కన పెట్టారుఆ వ్యాఖ్యలను కావాలని అన్నారా.. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు పవన్‍ నోటి నుండి బయటకు వచ్చి ఉంటాయి. చివరకు పవన్‍ కళ్యాణ్‍ కూడా నాదెండ్ల సామాజికవర్గంపై ఎంత కసిగా వ్యతిరేకంగా ఉన్నారో..ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోందంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.