Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘కోటరీ’ గుప్పిట్లో నారా లోకేష్‍..?

చంద్రబాబు రాజకీయ వారసుడుగా ఆయన కుమారుడు నారా లోకేష్‍ తెరపైకి వచ్చినప్పటికీ.. కొంతమంది సీనియర్‍ పార్టీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. లోకేష్‍ను చంద్రబాబు వారసుడిగా గుర్తించేందుకు వారికి మనసు ఒప్పటం లేదని.. ప్రచారం జరుగుతోంది.

తాను దివంగత ఎన్టీ.రామారావుకు స్వయాన మనవడునని.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏకైక కుమారుడునని.. నందమూరి బాలకృష్ణకు స్వయాన అల్లుడని.. లోకేష్‍కు కొంత అహంకారం ఉందని.. కానీ తాత దివంగత ఎన్టీ.రామారావు లక్షణాలు లోకేష్‍లో కనిపించటం లేదని.. ఎన్టీఆర్‍ వలె పార్టీ కార్యకర్తలను, అభిమానులను ఆదరించకుండా… తండ్రి చంద్రబాబునే ఆదర్శంగా తీసుకుని రాజకీయంగా కొంత దెబ్బతిన్నారని.. రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. తెలుగుదేశం పార్టీలో మెజార్టీ నేతలలో, కార్యకర్తలలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే నమ్మకం ఉండదు. కానీ నమ్మకం ఉందని.. వారందరూ నటిస్తూ ఉంటారని.. పార్టీ నేతలే తెర వెనుక చెబుతుంటారు.

- Advertisement -

తన చుట్టూ ఉన్న కోటరీ ప్రభావంతో మాజీ మంత్రి నారా లోకేష్‍ అటు సీనియర్లకు, ఇటు పార్టీ కార్యకర్తలకు దూరమయ్యారని ప్రచారం జరుగుతోంది. అప్పట్లో చంద్రబాబును కోటరీ రాజకీయంగా ముంచగా.. తాజాగా నారా లోకేష్‍ను కూడా కోటరీయే ముంచుతుందని.. పార్టీ సీనియర్‍ నేతలు తెర వెనుక చెబుతున్నారు. రాజకీయంగా నారా లోకేష్‍ దూకుడు పెంచినా.. అది ఆయన ఆశించినంత విధ0గా ముందుకు వెళ్లటం లేదు. రాజకీయంగా లోకేష్‍ ఎదగలేకపోతున్నారు. దీనంతటికీ.. లోకేష్‍ చుట్టూ ఉన్న కోటరీయే కారణం అని విమర్శలు వస్తున్నా.. ఆ కోటరినీ దూరం పెట్టడంలో లోకేష్‍ విఫలం అయ్యారని సీనియర్‍ నేతలు అంటుంటారు.

నిన్న కాక మొన్న విశాఖపట్నం వెళ్లినప్పుడు ఆయన చుట్టూ ద్వితీయ శ్రేణి నాయకులు కనిపించారే తప్ప పార్టీ సీనియర్‍ నేతలు ఎవరూ కనిపించని దృశ్యాలు పలు ఛానెళ్లలో ప్రసారం అయ్యాయి. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కానీ.. అచ్చెన్నాయుడు కానీ.. గంటా శ్రీనివాసరావు కానీ.. ఇతర పార్టీ ముఖ్యులు ఎవరూ లోకేష్‍ పర్యటనలో కనిపించ లేదట.

ఎయిర్‍పోర్టులో స్వాగతం పలికింది కూడా ద్వితీయ శ్రేణి నాయకులే అట. మొత్తానికి చినబాబు చినబుచ్చుకునేలా.. టిడిపి మాజీ మంత్రులు, సీనియర్‍ నేతలు వ్యవహరించారా..? లోకేష్‍ తమను చిన్న చూపు చూశారని.. ముఖం చాటేశారా అనే విషయం బయట పడటం లేదు. ఇప్పటికైనా తన చుట్టూ ఉన్న కోటరీని పక్కన పెట్టి తాత ఎన్టీరామారావును ఆరదర్శంగా తీసుకోగలిగితే.. పార్టీ సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలందరూ బ్రహ్మరధం పడతారు. తండ్రి చంద్రబాబును లోకేష్‍ ఆదర్శంగా తీసుకోగలిగితే.. మరి కొంత కాలం వెనకబడతారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave A Reply

Your email address will not be published.