Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మొట్టమొదటి సారి నరేంద్ర మోడీకి షాక్‍..!

గుజరాత్‍ ముఖ్యమంత్రిగా.. ఎక్కడా ఎదురు లేకుండా.. అతిరధ మహారధ బిజెపి నాయకులను తెర మరుగు చేసిన నరేంద్రమోడీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక.. జాతీయ బిజెపి పెద్దలందరినీ.. ‘డమ్మీ’లుగా మార్చి గత ఏడేళ్ల నుండి నిరాటంకంగా అధికారం చెలాయిస్తున్న నరేంద్ర మోడీకి ఇటీవల కాలంలో ఆయన ఆశించిన దానికి విరుద్దమైన పరిస్థితులు ఎదురయ్యాయి.. షాక్‍ ఇచ్చాయి.

ఆ షాక్‍ ఇచ్చింది మరెవరో కాదు.. తెలుగుతేజమైన సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి ఎన్‍వి.రమణ. సిబిఐ డైరెక్టర్‍ ఎంపికలో ఇంతకు ముందు తన ఇష్టారాజ్యంగా ఎంపిక చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తాజాగా సిబిఐ డైరెక్టర్‍ ఎంపికలో సుప్రీంకోర్టు తీర్పును తెరపైకి తెచ్చి నరేంద్ర మోడీకి షాక్‍ ఇవ్వటమే కాకుండా.. ఆయన ఎవరినైతే సిబిఐ డైరెక్టరుగా ఎంపిక చేయాలని ఆశించారో.. అందుకు విరుద్దంగా సిబిఐకు డైరెక్టర్‍ను ఎంపిక చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.

- Advertisement -

ఇంతకు ముందు వరకు సిబిఐ డైరెక్టర్‍గా ఎవరు నియమితులైనా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కనుసన్నల్లో పనిచేసేవారు. ఎవరిని ఇబ్బంది పెట్టమంటే వారిని ఇబ్బంది పెట్టేవారు. ఏ కేసును నీరు గార్చమన్నా..ఆ కేసును సిబిఐ అధికారులు నీరుగార్చేవారని విమర్శ ఉంది. మిమ్ములను సిబిఐ డైరెక్టర్‍గా నేనే ఎంపిక చేస్తున్నాను. నా మాట తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అన్న మోడికి.. తాజాగా సిబిఐ డైరెక్టర్‍ ఎంపికలో సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‍వి.రమణ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెరపైకి తెచ్చారు.

ఒక అధికారిని సిబిఐ డైరెక్టర్‍గా ఎంపిక చేయాలంటే.. కనీసం ఆరు మాసాలు సర్వీసు ఉండాల్సిందే. ఆరు మాసాలు సర్వీసు లేని వారిని సిబిఐ డైరెక్టర్‍గా ఎంపిక చేయవద్దు అని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి రమణ మాట్లాడటం జరిగిందని.. చేసేది ఏమీ లేక కక్కలేక మింగలేక తాను ఎవరినైతే సిబిఐ డైరెక్టర్‍గా ఎంపికచేయాలనుకున్నారో.. అందుకు విరుద్దంగా సిబిఐ డైరెక్టర్‍ సమావేశం జరిగింది.

చివరకు సిబిఐ డైరెక్టర్‍గా సుబోత్‍ కుమార్‍ జైస్వాల్‍ను అయిష్టంగానే నియమించాల్సిన పరిస్థితి నరేంద్రమోడీకి ఎదురయింది. ఇద్దరు అధికారులలో ఒక అధికారి జులై మాసానికి, మరో అధికారి సెప్టెంబరు మాసానికి రిటైర్డు అవబోతున్న నేపధ్యంలో వారిద్దరిలో ఒకరిని నియమించాలని •మోడీ భావించినా.. సుప్రీంకోర్టు గైడ్‍ లైన్స్ను తెరపైకి తీసుకురావటంతో.. నరేంద్ర మోడీ కోరిక నెరవేరలేదు. అటు ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా అధికారం చెలాయించిన.. చెలాయిస్తున్న మోడికి మొట్టమొదటి సారిగా ఆయన ఆశించింది నెరవేరలేదని… అధికార వర్గాలు అంటున్నాయి.

Leave A Reply

Your email address will not be published.