Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

నిమ్మగడ్డ పదవీ కాలం జూన్‍ మాసాంతం వరకా..?

స్థానిక సంస్థల ఎన్నికల కమీషనర్‍ నిమ్మగడ్డ రమేష్‍కుమార్‍ పదవీ కాలం మార్చి మాసాంతానికి పూర్తి అవుతోందని ఆ తరువాతే ఎన్నికలు నిర్వహించాలని.. ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి అండ్‍ కో భావిస్తున్నప్పటికీ.. ఆయన సర్వీసు మరో మూడు మాసాలు అనగా.. జూన్‍ మాసాంతం వరకు ఉంటుందని.. వారిలో ఏ ఒక్కరూ తెలుసుకోలేకపోతున్నారు. నిమ్మగడ్డను స్టేట్‍ ఎలక్షన్‍ కమీషనర్‍గా నియమించే ఉత్తర్వులలో ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఐదేళ్ల వరకు ఆ పదవిలో కొనసాగుతారని ఉంది. ఆ ఉత్తర్వు ప్రకారం 2021 మార్చి మాసాంతం వరకు నిమ్మగడ్డ పదవీ కాలం ఉంటుందని స్పప్టం అవుతోంది. కానీ నిమ్మగడ్డను ఎస్‍ఈసి పదవి నుండి మూడు నెలలు తొలగించాక.. ఆయన కోర్టుకు వెళ్లటం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లటంతో ఈ మధ్య కాలంలో మూడు నెలల సమయం పట్టింది.ఈ మూడు నెలల కాలంలో నిమ్మగడ్డను తొలగిస్తూ… ప్రభుత్వం మరొకరిని నియమించిన విషయం విధితమే. కానీ ఆ తరువాత కోర్టు తీర్పు నిమ్మగడ్డకు అనుకూలంగా వెలువడటంతో మళ్లీ నిమ్మగడ్డను ప్రభుత్వం నియమించింది.

- Advertisement -

నిమ్మగడ్డ తొలగింపు, కోర్టు తీర్పులతో మూడు నెలలు కాలం వృదా అయింది.ఈ నేపధ్యంలో ఆ మూడు నెలలు నిమ్మగడ్డ ఎలక్షన్‍ కమీషనర్‍గా పదవీ బాధ్యతలు నిర్వహించకపోవటంతో.. ఆ మూడునెలలు మళ్లీ అదనంగా రమేష్‍ కుమార్‍ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనిని బట్టి ప్రభుత్వం ఐదేళ్ల కిందట జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఐదేళ్లు పాటు ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది అని ఉండటంతో.. మధ్యలో మూడు నెలలు నిమ్మగడ్డ ఆ పదవిలో లేనందువలన ఆ మూడు నెలల కాలం మళ్లీ పదవి నిర్వహించాల్సిన నిబందనలు ఉండటంతో.. మార్చిలో రమేష్‍కుమార్‍ పదవీ కాలం పూర్తి కాకుండా.. జూన్‍ మాసాంతానికి నిమ్మగడ్డ స్టేట్‍ ఎలక్షన్‍ కమీషనర్‍గా ఆ పదవిలో కొనసాగే అవకాశాలున్నాయి. ఒకవేళ జగన్‍ ప్రభుత్వం నిమ్మగడ్డను మార్చి మాసాంతానికే రిటైర్డు కావాలని ఉత్తర్వులు జారీ చేసినా… అవి చెల్లుబాటు కావంటున్నారు న్యాయనిపుణులు. ఇంత వరకు ఈ విషయం పాలకుల దృష్టికి అధికారులు తీసుకెళ్లినట్లుగా లేదు. అందుకేనేమో నిమ్మగడ్డ మార్చి మాసాంతానికి రిటైర్డు అవుతారు.. ఆ తరువాతే ఎన్నికలు నిర్వహించాలని జగన్‍ భావిస్తున్నట్లు తెలిసింది.

కానీ ఆ విషయాన్ని ముఖ్యమంత్రి తెలుసుకోలేకపోతున్నారు. సీనియర్‍ అధికారులు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టడం లేదు. బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఐదేళ్ల పాటు నిమ్మగడ్డ ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులలో ఉండటంతో..మధ్యలో మూడు నెలలు నిమ్మగడ్డ ఎలక్షన్‍ కమీషనర్‍గా బాధ్యతలు నిర్వహించకపోవటంతో.. (నిమ్మగడ్డను తొలగించి మరొకరిని నియమించటం జరిగింది.)ఆ మూడు నెలలు తప్పనిసరిగా నిమ్మగడ్డ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను బట్టి స్పష్టం అవుతోంది. దీనిని బట్టి మార్చి మాసాంతానికి నిమ్మగడ్డ సర్వీసు పూర్తవుతుందని భావిస్తున్న పాలకులకు ఈ విషయం తెలిస్తే.. షాక్‍కు గురవటం ఖాయం.

Leave A Reply

Your email address will not be published.