Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మంత్రి అవంతి ఒద్దు.. అమరనాధే ముద్దా..?

మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా.. విశాఖపట్నం జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడుగా, ప్రియశిష్యుడుగా ప్రచారంలో ఉన్న మంత్రి అవంతి శ్రీనివాస్‍ను పదవి నుండి తప్పించి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్‍కు మంత్రి పదవి దక్కటం ఖాయం అంటున్నారు ఆ జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్యనేతలు. అప్పట్లో అవంతికే అదృష్టం కలిసి వచ్చి మంత్రి పదవి దక్కింది.

ఆయనను మంత్రి పదవి నుండి తప్పించటం ఖాయం. ఎమ్మెల్యే అమరనాద్‍కు మంత్రి పదవి దక్కటం అంతకన్నా ఖాయం అంటున్నారు అధికార పార్టీ నేతలు. అసలు విషయానికి వస్తే.. విజయసాయిరెడ్డ్డికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న అవంతిపై ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులు ఇచ్చేది తానేనని.. విజయసాయిరెడ్డి కాదనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని.. అప్పుడప్పుడు సిఎం జగన్‍ రెడ్డి నర్మగర్భంగా పలువురి సమక్షంలో వ్యాఖ్యలు చేసిన సంఘటనలున్నాయి.

- Advertisement -

అందుకేనేమో ఈ మధ్య కాలంలో మంత్రి అవంతి శ్రీనివాస్‍ చంద్రబాబు, లోకేష్‍లపై విమర్శలు, ఆరోపణలు తగ్గించారు. దీనిని అనుకూలంగా మలుగుచుకునేందకు అమరనాధ్‍ చంద్రబాబుపై విమర్శలు,ఆరోపణల దూకుడు పెంచారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మంత్రి అవంతి, ఎమ్మెల్యే అమరనాధ్‍లు కాపు సామాజికవర్గానికి చెందిన వారే. మంత్రి అవంతి శ్రీనివాస్‍ ప్రకాశం జిల్లా నుండి విశాఖ నగరానికి వలస రాగా ఎమ్మెల్యే అమరనాధ్‍ విశాఖ పట్టణానికి చెందిన వారే. ఆయన తండ్రి దివంగత గుడివాడ గురునాధరావు గతంలో మంత్రిగా కూడా పనిచేశారు.

విజయసాయిరెడ్డి శిష్యుడిగా ముద్ర పడిన మంత్రి అవంతిని
(గతంలో చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారు) సిఎం జగన్‍ రెడ్డి మంత్రి పదవి నుండి తొలగించటం ఖాయం అని.. ఆయనకు వీర విధేయుడైన ఎమ్మెల్యే అమరనాధ్‍కు మంత్రి పదవి ఇవ్వటం అంతకన్నా ఖాయమని అధికార ముఖ్యనేతలే తెర వెనుక మీడియాకు చెబుతూ తమ పేర్లు బయట పెట్టవద్దంటున్నారట.

Leave A Reply

Your email address will not be published.