Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

అధికారులు ఆ ఛానెల్‌నే చూస్తున్నారా..?

ఐఎఎస్‌ అధికారులు జిల్లాలు హెచ్‌వోడీలు, సచివాలయంలలో టివి సదుపాయం ఉన్న తమ కార్యాలయాలలో ‘సాక్షి’ టివి ఛానెల్‌ తప్ప మరే ఇతర టివి ఛానెళ్లను చూడటం లేదట. మరో ఛానెల్‌ పెట్టి చూసేందుకు ధైర్యం చాలటం లేదట. దీనిని బట్టి ఐఎఎస్‌ అధికారులు ఎంత భయాందోళనతో బాధ్యతలు నిర్వహిస్తున్నారో స్పష్టమవుతోంది అంటున్నారు అధికారులు. చంద్రబాబు హయాంలో తమ కార్యాలయాలలో సాక్షి టివి ఛానెల్‌ను ఇష్టంగా పదే పదే చూసిన కొందరు ఐఎఎస్‌ అధికారులు తాజా పరిస్థితులతో ఇష్టం ఉన్నా లేకున్నా.. సాక్షి టివి ఛానెల్‌ మాత్రమే చూస్తున్నారట.

- Advertisement -

ఇటీవల అధికార పార్టీ ప్రజాప్రతినిదులు, క్రిందిస్థాయి అధికారులు,ఉద్యోగులు ఆయా ఐఎఎస్‌ అధికారుల కార్యాలయాలను వివిధ పనులపై సందర్శించినప్పుడు ‘సాక్షి’ టివి మాత్రమే ప్రచారమవటం వీక్షించారు. కేవలం సాక్షి టివి ఛానెల్‌ మాత్రమే చూస్తారా.. మిగతా ఛానెళ్ల ప్రచారాలను చూడరా…? సాక్షి టివి ఛానెల్‌ వార్తలే నిజం అనుకుంటున్నారా..? మిగతా టివి ఛానెళ్ల ప్రచారాలు నిజం కాదనుకుంటున్నారా అని వారు ప్రశ్నిస్తే.. ఆ విషయాలను పక్కన పెట్టి మీ పని ఏమిటో చెప్పండి అని అంటున్నారట. ప్రత్యేక ప్రదాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, అనేక హెచ్‌వోడీలలో పని చేస్తున్న ఐఎఎస్‌ అధికారులు, కార్పోరేషన్ల ఎండీల కార్యాలయాలలో మెజార్టీ ఐఎఎస్‌ అధికారులు సాక్షి టివి ఛానెల్‌ను మాత్రమే చూస్తున్నారట.

సాక్షి టివి ఛానెల్‌ ప్రచారాలను చూడకుంటే.. ‘బదిలీ’ వేటు పడిద్దని భయమా..? లేక తమను చంద్రబాబు సానుభూతిపరులుగా చిత్రీకరిస్తారని అనుకుంటున్నారా..?అని పలువురుప్రశ్నిస్తున్నారు. సమాజానికి గుండెకాయ లాంటి ఐఎఎస్‌ అధికారులే భయాందోళనలతో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితి పొరుగు రాష్ట్రాలలో, ఇంతకు ముందు ఉమ్మడి రాష్ట్రమైన ఏపిలో కనిపించలేదనేది యదార్ధం. సాక్షి టివి ఛానెల్‌ను ఐఎఎస్‌ అధికారులు ఇష్టం ఉన్నా లేకున్నా.. పరస్పరం పోటీ పడి వీక్షిస్తున్నారనే విమర్శ కూడా వస్తుంది.

Leave A Reply

Your email address will not be published.