Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘మాస్టర్‌’ నుంచి మరో పాట వదిలారు

ఇలయదళపతి విజయ్‌, విజయ్‌ సేతుపతి, మాళవిక మోహనన్‌, ఆండ్రియా తదితరులు నటించిన చిత్రం ‘మాస్టర్‌’. ‘ఖైదీ’ చిత్ర దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఓటీటీలో విడుదల అవుతుందంటూ వార్తలు వినిపించాయి. అయితే విజయ్‌ అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రాన్ని థియేటర్స్‌ ఎప్పుడు తెరిస్తే.. అప్పుడు థియేటర్లలోనే విడుదల చేస్తామని చిత్రయూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం థియేటర్స్ తెరిచినప్పటికీ పరిస్థితులను చూసుకుని విడుదల చేయాలని చిత్రయూనిట్‌ భావిస్తోంది.

- Advertisement -

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ‘క్విట్‌ పన్నుడ’ అనే లిరిక్స్‌తో సాగుతున్న ఈ పాటకు విఘ్నేష్‌ శివన్‌ లిరిక్స్‌ అందించడం విశేషం. అనిరుధ్‌ సంగీత సారథ్యంలో ఈ పాట రూపుదిద్దుకుంది. సంగీత దర్శకుడు అనిరుద్ధే ఆలపించారు. అనిరుధ్‌ బర్త్‌డే సందర్భంగా ఈ పాటను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది.

Leave A Reply

Your email address will not be published.