Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఆరోగ్యానికి బొప్పాయి

ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,అస్సాం,పంజాబ్ వంటి రాష్టాలలో బొప్పాయి ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రధానంగా మన రెండు తెలుగు రాష్టాలలోని మెదక్,కడప మరియు ఆదిలాబాద్ జిల్లాలలో ఎక్కువగా ఈ పండును సాగుచేస్తున్నారు. ఈ పంట కోత సమయయం చాలా తక్కువగా ఉండటం,ఈ మధ్య డెంగ్యూ వ్యాధికి చికిత్సగా వైద్యులు ఈ పండుని తినమనటం వంటి కారణాల వలన బొప్పాయి పండుకి డిమాండ్ బాగా పెరిగింది.బొప్పాయి పండులో విటమిన్ ఏ ,బి ,సి ,డి ఉండటం వలన ఈ పండుని రోజూ తీసుకోవటం వలన అనేక రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అందులోనా ఈ పండులో ” పెప్పిన్ ” అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ మస్యతో బాధపడేవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

పోషకాలు :

  • బొప్పాయి పండులో కెరోటిన్,విటమిన్ A,B,C,D,E వంటివి చాలా పుష్కలంగా ఉంటాయి.
  • ఖనిజాలు,లవణాలు,ఫ్లేవోనైడ్లు,పాన్తోనిక్ ఆమ్లాలు,పీచు వంటి పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి.
  • ఈ పండులో విటమిన్ C అధిక మోతాదులో ఉండటం వలన దంతాల సమస్య,చిగుళ్ల నుండి రక్తం కారటం,రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచటం,రోగనిరోధక శక్తిని పెంచటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
  • ఇందులో బీటా కెరోటిన్ అనే పదార్థం ఉండటం వలన కంటికి సంబంధించిన అనేక రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
  • బొప్పాయి పండులో విటమిన్ ఏ అధిక శాతంలో ఉంటుంది. అలాగే ఇందులో కాల్షియం,భాస్వరం,మెగ్నిషియం వంటివి కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి.

- Advertisement -

ఉపయోగాలు:

  • ఈ పండులో ఉండే తెల్లని గుజ్జు మొఖానికి అప్లై చేసుకోవటం వలన నల్లటి మచ్చలు,మొటిమలు తొలగిపోయి చాలా అందంగా తయారవుతారు.
  • చర్మం జిడ్డుగా ఉన్న వారికి బొప్పాయితో చేసే పేస్ ప్యాక్ ఎంతగానో సహాయపడుతుంది.
  • మలబద్దకంసమస్య ఉన్నవారు బొప్పాయి పండు తినటం చాలా మంచిది.
  • తామర వ్యాధి ఉన్నవారు బొప్పాయి పండు తినటం వలన వ్యాధి తీవ్రత తగ్గుతుంది.
  • బొప్పాయి కాయ తినటం వలనబి.పి అదుపులో ఉంటుంది.
  • బొప్పాయి ఆకుల రసాన్ని మరియు పండుని తినటం వలనడెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్యని పెంచటంలో తోడ్పడుతుంది.
  • జలుబు,ఫ్లూ జ్వరం,చెవి నొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు బొప్పాయి పండు తినటం వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  • రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచటంలో ఉపయోగపడుతుంది.
  • రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది.
  • బొప్పాయిలో ఉండే పెప్పీన్ అనేప్రదార్థం జీర్ణక్రియకు సంబందించిన మందులు తయారు చేయటంలో వాడుతున్నారు.
  • దీనిలో ఉండే పీచు వలన అర్శమొలలు రాకుండా కాపాడుతుంది.
  • ఆస్తమా మరియుకీళ్లనొప్పులు తగ్గిస్తుంది.

జాగ్రత్తలు:

  • గర్భంతో ఉన్న ఆడవారు బొప్పాయి కాయని తినకూడదు. ఇందులో పెపిన్ అధిక మోతాదులో ఉండటం వలన గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది.
  • బొప్పాయి కాయలో పాలు ఉండటం వలన దురద కలుగుతుంది. అందుకే మనం బొప్పాయి కాయని కోసేటప్పుడు పాలు మన చేతికి తగిలినప్పుడు దురద కలుగుతుంది.
  • బొప్పాయి పండుని ఎక్కువగా తినటం వలన కెరటనిమియా అనే వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

 

Leave A Reply

Your email address will not be published.