Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఆ మాజీ మంత్రికి పెత్తనం ఇచ్చినందుకు..!

దివంగత ఎన్టీఆర్‍ హయాంలో ఆ మాజీ మంత్రికి విలువ ఉండేది. కానీ రాజకీయాలు మొత్తం ఆ మాజీ మంత్రి పేరుతో నడిచేవి కాదు. మాకు మీ కుటుంబం అంటే చాలా అభిమానం, గౌరవం. అందుకే మీకు మంత్రి పదవి ఇస్తున్నాను. అందరిపై పెత్తనం చేయాలని మీరు కోరుకోవద్దు. కాలం మారింది. తరాలు మారాయి. మీరు కూడా మారాలి అని దివంగత ఎన్టీ.రామారావు అప్పట్లో ఆ మాజీ మంత్రికి అనేక సందర్భాలలో చెప్పటం జరిగిందని.. పాత తరం పార్టీ నేతలు చెబుతుంటారు. ఎన్టీఆర్‍ హయాం ముగిసింది. చంద్రబాబు హయాం తెరపైకి వచ్చాక ఆ మాజీ మంత్రికే పెత్తనం అప్పజెప్పి అందుకు మూల్యం చెల్లించుకున్నారు చంద్రబాబు.

ఆ మాజీ మంత్రికి 40ఏళ్ల రాజకీయ, అధికార అనుభవం ఉంది. నిజాయితీ పరుడిగా పేరు కూడా ఉంది. కొత్త కుటుంబ0 నుండి ఆ మాజీ మంత్రి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ రాజకీయ లౌక్యం ప్రదర్శించరు. అంతా తన మాటే వినాలని కోరుకుంటారు. ఎవరూ ఎదురు చెప్పకూడదు. అంతా నేను కోరుకున్నట్లే జరగాలి అని ఆ మాజీ మంత్రి భావిస్తుంటారట.

ఆ మాజీ మంత్రికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నికలలో ఘోరంగా ఓడిపోవటానికి ఆ మాజీ మంత్రే కారణమని చంద్రబాబుకు కూడా తెలుసు. అయినప్పటికీ..ఆ మాజీ మంత్రి మీద ఈగ వాలనివ్వరు. 40 ఏళ్ల నుండి ఆ మాజీ మంత్రిని భరిస్తున్నాం.. ఇంకెంత కాలం భరించాలి చంద్రబాబు అని ఎవరైనా అడిగితే.. ఏదో విధంగా సర్దుకుపోండి అని చంద్రబాబు అంటుంటారట.

- Advertisement -

గత ఎన్నికలలో ఆ జిల్లాలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.. ఒక్క ఎమ్మెల్యే కూడా విజయం సాధించలేదు. రాజ్యాలు పోయాయి. రాజ్యాలు పాలించిన వారు తెరమరుగు అవుతున్నారు. ఇంకా రాజవంశానికి చెందిన వారిపై చంద్రబాబు ఆధార పడటం కొంప ముంచింది. ఆ మాజీ మంత్రికి లౌక్యం తెలియదు. తన సిఫార్సులు, సూచనలనే పట్టించుకోవాలని కోరుకుంటారు. అంతా నా ఇష్టం.. నేను చెప్పిందే జరగాలని మూర్ఖంగా ముందుకు పోతుంటారు. ఆ మాజీ మంత్రికి విలువ ఇవ్వండి.. గౌరవాభిమానాలు చూపండి.. పెద్ద పదవి ఇవ్వండి. కానీ రాజకీయంగా ఆయన పెత్తనాన్ని తగ్గించండి. ప్రజలలో రాజకీయ చైతన్యం పెరిగింది.

జమీందార్లను, రాజులను మెజార్టీ ఓటర్లు పట్టించుకునే రోజులు పోయాయి. బిసి వర్గాలకు పెద్ద పీట వేస్తేనే జిల్లాలో పార్టీ మళ్లీ బలం పుంజుకుంటుందని చంద్రబాబుకు తెలుసు. అయినా ఆ మాజీ మంత్రిని చంద్రబాబు ఏమీ అనలేరు. 40 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నాను. హుందాగా క్రియా శీలక రాజకీయాల నుండి తప్పుకుంటే మంచిది. యువతరాన్ని ప్రోత్సహించాలని ఇప్పటికీ ఆ మాజీ మంత్రి భావించటం లేదు. ఏదైనా గట్టిగా చెబితే ఆ మాజీ మంత్రి బాధపడతారని చంద్రబాబు భావిస్తుంటారు.

గట్టిగా చెప్పకపోతే ఆ మాజీ మంత్రి అంతా నా ఇష్టం అంటారు. ఆ మాజీ మంత్రి బారి నుండి జిల్లాలో పార్టీని చంద్రబాబు ఎలా రక్షించుకోబోతున్నారో వేచి చూడాల్సిందే. ఆ మాజీ మంత్రి పేరు పూసపాటి అశోక్‍గజపతి రాజు. తాను ముఖ్యమంత్రి అవటానికి మద్దతిచ్చినందుకు కృతజ్ఞతగా చంద్రబాబు ఆయన నిర్ణయాలను అమలు చేస్తారు. ఇన్నేళ్లు గడిచినా చంద్రబాబు ఆయనపై ఆధారపడినందుకు 2019 ఎన్నికలలో సింగిల్‍ సీటు కూడా తెలుగుదేశం పార్టీకి దక్కలేదు. మాజీ మంత్రి మంచి వారు అనటంలో అనుమానం లేదు. కానీ అంతా తన మాట వినాలని కోరుకోవటం తప్పు కాదా అని చంద్రబాబును పార్టీ నేతలు అడిగితే ఆయన మౌనం వహించారు. అందుకు మూల్యం చెల్లించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.