Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమీషనర్‌గా ప్రవీణ్‌ ప్రకాష్‌..?!

ముఖ్యమంత్రికార్యాలయ ముఖ్యకార్యదర్శిగా ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్‌ ప్రకాష్‌ను జులై మాసాంతానికి ఢల్లీిలో ఉన్న ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమీషనర్‌గా బదిలీ చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. మంగళవారంనాడు జిఎడి పొలిటికల్‌ శాఖాదిపతిగా ఎప్పటి నుండో బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్‌ ప్రకాష్‌ను ఆ బాధ్యతల నుండి తప్పించి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఐఎఎస్‌ అధికారి ముత్యాలరాజుకు ఆ బాధ్యతలు అప్పజెప్పిన విషయం విధితమే.

ప్రవీణ్‌ ప్రకాష్‌ను ఎప్పటి నుండో వదలించుకోవాలనుకున్న సిఎం జగన్‌ రెడ్డి ముందుగా ఆయనను జిఎడి శాఖాదిపతిగా అదనపు బాధ్యతలు నుండి తప్పించారు. జులై మాసాంతానికి ఢల్లీిలోని ఏపీ భవన్‌ రెసిడెన్స్‌ కమీషనర్‌గా ప్రవీణ్‌ ప్రకాష్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

- Advertisement -

ఏపీ భవన్‌ ముఖ్య రెసిడెంట్‌ కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఎఎస్‌ అధికారి అభయ్‌ త్రిపాఠి జూన్‌ మాసాంతానికి రిటైర్డు కాబోతున్న నేపధ్యంలో ఆ పోస్టులోప్రవీణ్‌ ప్రకాష్‌ను నియమించే అవకాశాలున్నాయని అధికార వర్గాల భోగట్టా. కొన్ని రోజుల కిందట కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు.

ముఖ్యమంత్రితో ఉన్న చనువును అడ్డుపెట్టుకుని .. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం.. ముఖ్యమంత్రి పేరుతో కొంతమందిని బెదిరించటం వంటి సంఘటనలు జరిగిననేపధ్యంలో.. వారిలో కొంత మంది సిఎం జగన్‌ రెడ్డిని కలిసిన సందర్భంలో ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అంతే కాకుండా ఇటీవల న్యాయస్థానాలలో కూడా ప్రవీణ్‌ ప్రకాష్‌ దోషిగా నిలబడటానికి ప్రవీణ్‌ ప్రకాష్‌ ముఖ్యకారణమని జగన్‌ తెలుసుకున్నారు.

న్యాయస్థానాలలో ప్రభుత్వ తీరును తప్పుబట్టడం వెనుక ప్రవీణ్‌ ప్రకాష్‌ తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాలే కారణమని జగన్‌కు అనుభవంతో కానీ తెలిసిరాలేదు. వాస్తవ సంఘటనలన్నీ బయటకు రావటంతో ప్రవీణ్‌ ప్రకాష్‌ను ఇంకా కొంత కాలం కొనసాగిస్తే.. జగన్‌ రెడ్డి భ్రష్టు పట్టిపోవటం ఖాయమని ప్రచారం జరిగింది. ఏది ఏమైనప్పటికీ.. ప్రవీణ్‌ ప్రకాష్‌దూకుడుకు కళ్లెం పడిరది. ఆయన అధికారాలను జగన్‌ రెడ్డి కత్తిరించారు. జులై మాసాంతానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కూడా జగన్‌ రెడ్డిని తప్పించాలని జగన్‌ రెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు చెప్పుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.