Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

టిటిడి ఛైర్మన్‍ పదవి కోసం రాయలసీమ రెడ్లు ఆరాటం..!

టిటిడి ఛైర్మన్‍ వైవి.సుబ్బారెడ్డి పదవీ కాలం పూర్తవటంతో తనకు మళ్లీ టిటిడి ఛైర్మన్‍ పదవీ కాలం పెంచవద్దని సిఎం జగన్‍రెడ్డిని స్వయంగా వైవి.సుబ్బారెడ్డి కలిసి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ సుబ్బారెడ్డికే మరో సంవత్సరం పాటు పదవీ కాలం పొడిగించాలని సిఎం జగన్‍ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.టిటిడి ఛైర్మన్‍ పదవి కమ్మ కులస్తులకు చంద్రబాబు హయాంలోనే దక్కలేదు.

ఆ కులస్తులకు సిఎం జగన్‍ రెడ్డి ఆ పదవి ఇచ్చే ప్రసక్తే లేదు. టిటిడి ఛైర్మన్‍ పదవిని కాపులకు, బిసిలకు చంద్రబాబు ఇచ్చినా.. జగన్‍ రెడ్డి ఆ కులాలకు ఇవ్వరని స్పష్టం అవుతోంది. తాజాగా క్షత్రిక సామాజికవర్గానికి చెందిన వారికి టిటిడి ఛైర్మన్‍ పదవిని ఇవ్వాలని సిఎం జగన్‍ రెడ్డి భావిస్తున్నట్లు సోషల్‍ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని.. ఇదంతా పథకం ప్రకారం సలహాదారుడు సూచనలతోనే అధికార పార్టీ సోషల్‍ మీడియా విభాగం ప్రచారం చేస్తుందంటున్నారు అదికార పార్టీ నేతలు.

- Advertisement -

ఇక అసలు విషయానికి వస్తే.. టిటిడి ఛైర్మన్‍ పదవికోసం అధికార పార్టీకి చెందిన రాయలసీమ నాలుగు జిల్లాలకు చెందిన రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ముఖ్యనేతలే ఏదో విధంగా ఆ పదవిని పొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా ప్రయత్నిస్తున్న వారిలో టిటిడి మాజీ ఛైర్మన్‍ భూమన కరుణాకర్‍ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మల్లిఖార్జునరెడ్డితో పాటు 2019ఎన్నికలకు ముందు సిఎం జగన్‍ రెడ్డి ఆదేశాలతో ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే కూడా టిటిడి ఛైర్మన్‍ పదవి ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

అంతే కాకుండా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‍ రెడ్డితో పాటు మరి కొంతమంది అదే సామాజికవర్గానికి చెందిన నాయకులు టిటిడి ఛైర్మన్‍ పదవికోసం సిఎం జగన్‍ రెడ్డిపై ఎవరెవరి ద్వారా ఒత్తిడి చేయాలనే విషయంపై ఆరా తీస్తున్నారట. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికే టిటిడి ఛైర్మన్‍ పదవి దక్కటం ఖాయం . (వైవి.సుబ్బారెడ్డికి మరో సంవత్సరం గడువు పెంచినా ఆశ్చర్య పడక్కర్లేదంటున్నారు అధికార పార్టీ నేతలు) క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారిని టిటిడి ఛైర్మన్‍గా నియమిస్తారని జరుగుతున్న ప్రచారం కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందే తప్ప రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారినే టిటిడి ఛైర్మన్‍గా జగన్‍ రెడ్డి నియమిస్తున్నారని.. అధికార ముఖ్య నేతలు తెర వెనుక మీడియాతో చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.