Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

సిఎం జగన్‍ రెడ్డి రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్‍..!

ముఖ్యమంత్రిగా జగన్‍ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక.. మూడు రాజధానుల ప్రస్తావనను ఆయనే తెరపైకి తెచ్చారు. అమరావతి అభివృద్ది ఎక్కడికక్కడే నిలిచిపోయింది. పూర్తి కావచ్చిన నిర్మాణాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఐటి రంగ నిపుణులు పొరుగు రాష్ట్రాలకు వలన పోయారు.

నవరత్నాల పధకాలతో పప్పు, బెల్లాలను ప్రజలకు అందజేస్తూ… కాలం గడుపుతున్న జగన్‍ రెడ్డి తీరును బాహాటంగా ఎవరూ తప్పుపట్టకపోయినా.. తాజాగా కరోనా దెబ్బకు వేలాది మంది పిట్టల్లాగా రాలిపోతుంటే.. ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసం నుండి బయటకు రావటం లేదని.. సమీక్షలు, సమావేశాలతో కాలం గడుపుతున్నారని.. ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని వెం•నే రాజీనామా చేయాలనే డిమాండ్‍ తెరపైకి వచ్చింది.

రాష్ట్రంలో కరోనా మహమ్మారి పరిస్థితులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న నేపధ్యంలో.. సరైన వైద్య సదుపాయాలు సామాన్యులకు అందుబాటులో లేకపోవటంతో.. ఆ వ్యాది బారిన పడ్డవారు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులున్న నేపధ్యంలో తిరుపతిలోని ఎస్వీఆర్‍ రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‍ అందకపోవటంతో.. 11మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన కలిచివేస్తుంది.

- Advertisement -

దీనికి ముఖ్యమంత్రిజగన్‍ రెడ్డే బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‍ అమాంతంగా పెరిగిపోయింది. ట్విట్టర్‍లో రాజీనామా హ్యాష్‍ ట్యాగ్‍ ట్రెండింగ్‍లో వేలాది మంది ట్విట్‍లు చేశారంటే.. జగన్‍ రెడ్డి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత పెరిగిందో స్పష్టమవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదంతా చంద్రబాబు కుట్ర.. ఆయన సామాజికవర్గానికి చెందిన వారు మాత్రమే ఈ ట్వీట్లు చేస్తున్నారని.. అధికార పార్టీ నాయకులు ఇంకా ఎదురు దాడి ప్రారంభించలేదు. సోషల్‍ మీడియాలో జగన్‍ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆయన ముఖ్యమంత్రి పదవికి పనికి రాడు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సెకండ్‍ వేవ్‍ ప్రభంజనం వచ్చినప్పటి నుండి జగన్‍ రెడ్డి ఇంత వరకు మీడియా సమావేశం కూడా నిర్వహించలేదని.. అనేక మంది జర్నలిష్టులు తప్పుబడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే తిరుపతి ఆసుపత్రిలో మరణ మృదంగం మోగిందని పలువురు ఆరోపించారు.

జగన్‍ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్దించే వారిపై పరుష పదజాలాన్ని పలువురు ఉపయోగిస్తున్నారంటే.. పరిస్థితి ఏమిటో.. పాలకులకు, అమాత్యులకు, అధికార ప్రజాప్రతినిధులకు బోధపడినా.. (ఏమీ తెలియనట్లుగా… గోరంతను కొండంతగా ప్రతిపక్ష నేతలు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.) రాష్ట్రంలో ఏమీ జరగనట్లు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని.. దేశ విదేశాల నుండి అనేక మంది ట్విట్టర్‍ ద్వారా జగన్‍ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‍ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.