Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

జగన్‍ బెయిల్‍ రద్దుకు హైకోర్టులో ఆర్‍ఆర్‍ఆర్‍ పిటిషన్‍

సిబిఐ కోర్టులో ఎ-1గా ఉన్న ముఖ్యమంత్రి జగన్‍ బెయిల్‍ను రద్దు చేయాలని అధికార పార్టీ నరసాపూర్‍ ఎంపీ రఘురాంకృష్ణం రాజు హైకోర్టులో పిటిషన్‍ దాఖలు చేశారు. 11 సిబిఐ ఛార్జ్ షీట్లలో సిఎం జగన్‍ రెడ్డి ఏ-1గా ఉన్నారని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా మా పార్టీకి చెడ్డపేరు రాకుండా చూడాలనే ఉద్దేశంతో న్యాయస్థానంలో పిటిషన్‍ దాఖలు చేసినట్లు ఆర్‍ఆర్‍ఆర్‍ తెలిపారు.

- Advertisement -

మంగళవారం నాడు ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఛార్జి షీట్లు వేసినా.. కేసులు నత్త నడక నడుస్తున్నాయని.. కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని.. మా ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి త్వరగా కేసుల నుండి బయట పడాలనే సదుద్దేశంతోనే న్యాయస్థానంలో కేసు వేశానన్నారు. త్వరలో ఈ కేసు తెలిపోతుందని.. తాను నమ్ముతున్నానని.. ప్రత్యర్ధులు నానా రకాలుగా మా ముఖ్యమంత్రిపై మాట్లాడటం బాధను కలిగించిందని.. ఆ అవకాశం ఏ ఒక్కరికీ ఇవ్వకూడదనే సదుద్దేశంతోనే న్యాయస్థానం తలుపు తట్టానన్నారు ఆర్‍ఆర్‍ఆర్‍.

కేసుల సందర్భంగా కోర్టుకు వెళ్లకపోవటం అవమానించే కరంగా ఉందని.. అటు ప్రజాస్వామ్యాన్ని, ఇటు పార్టీని రక్షించుకోవాలని దివంగత ముఖ్యమంత్రి తమిళనాడు జయలలిత, బీహార్‍ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‍ యాదవ్‍లు, ఏ విదంగా తమ పదవిని వేరే వారిని అప్పజెప్పి అవకాశం ఇచ్చారో.. అదే విధంగా మా ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని మరొకరికి ఇచ్చి కేసుల నుండి బయట పడవేయాలనే ఉద్దేశంతోనే తాను న్యాయస్థానంలో పిటిషన్‍ వేసినట్లు ఆర్‍ఆర్‍ఆర్‍ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.