Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

అధికార ఎమ్మెల్యే సవాల్‍కు మాజీ ఎమ్మెల్యే పరార్‍..?

ఆ నియోజకవర్గంలో అపార, రాజకీయ, అధికార అనుభవం టిడిపి మాజీ ఎమ్మెల్యేకు ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని చెలాయించారు. తన చుట్టూ వండిమాగదులు, ఆంతరంగికుల వలన అప్రతిష్టపాలై ఓటర్లలో వ్యతిరేకత కొని తెచ్చుకుని 2019 ఎన్నికలలో జగన్‍ పార్టీ అభ్యర్ధిపై భారీ తేడాతో ఓడిపోయారు. అధికారంలో ఉన్నంత కాలం ఎవరు ఏం చెప్పినా ఆ మాజీ ఎమ్మెల్యేకు వినపడేది కాదు.. వాస్తవాలు కనిపించేవి కావు. దీంతో ఆ మాజీ ఎమ్మెల్యే రెచ్చిపోయేవారు.

వండిమాగదులు, ఆంతరంగికులు కూడా రెచ్చిపోయి ఆర్దికంగా కూడా బాగా వెనకేసుకున్నారని విమర్శలు వచ్చాయి. ఇదంతా గతం. 2019 ఎన్నికలలో ఆ మాజీ ఎమ్మెల్యేపై జగన్‍ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన నేత అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యేకు రెండు సార్లు ఓడిపోయిన పరిస్థితులు ఎదురయ్యాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన నేత గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున, జగన్‍ పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన అనుభవం ఉంది.

- Advertisement -

తాజాగా జరగబోతున్న మునిసిపల్‍ ఎన్నికలలో మునిసిపాలిటీలలో కనీసం ఐదు వార్డులలోనైనా మాజీ ఎమ్మెల్యే తన అభ్యర్ధులను గెలిపించుకోగలిగితే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అధికార పార్టీ ఎమ్మెల్యే సవాల్‍ విసిరారు. నిన్న కాక మొన్న గెలిచిన ఎమ్మెల్యే సవాల్‍ విసిరితే అందుకు ధీటుగా స్పందించాల్సిన మాజీ ఎమ్మెల్యే మౌనం వహిస్తున్నారంటే.. అధికార ఎమ్మెల్యేతో పరోక్షంగా కుమ్మక్కయ్యారా..? అధికార ఎమ్మెల్యే సవాల్‍కు తట్టుకోలేనని వెనకడుగు వేశారా..?

ఇక అసలు విషయానికి వస్తే.. గుంటూరు జిల్లా వినుకొండ మునిసిపాలిటీకి జరగబోతున్న ఎన్నికలలో అధికార ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే నరసరావుపేట లోక్‍సభ పార్టీ అధ్యక్షుడు జివి.ఆంజనేయులుకు విసిరిన సవాల్‍ పట్టణంలో సంచలనం కలిగించింది. కనీసం ఐదు వార్డులలో కూడా పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోలేని పరిస్థితిలో మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు ఉన్నారా….? అధికార పార్టీ ఎమ్మెల్యేకు అంత ధీమా ఏ కారణాలతో ఉందనే విషయం పక్కన పెడితే.. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు వినుకొండ పట్టణంలో పూర్తిగా పట్టుకోల్పోయారని స్పష్టం అవుతోంది.

Leave A Reply

Your email address will not be published.