Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

జగన్‌ రెడ్డికి గుడ్‌బై చెప్పనున్న అధికార ఎమ్మెల్యే..?

ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి పేరుతో ఒక గ్రామం ఉంది. భక్తులు పూజించే దేవుడి పేరే ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేది. రెండేళ్లలో ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేకు సమస్యలు, ఆర్దికపరమైన ఇబ్బందులు తలెత్తడంతో పార్టీలో ఉన్నా..లేకున్నా.. ఒకటే అన్న విధంగా తాజాపరిస్థితులు ఎదురవటంతో సిఎం జగన్‌రెడ్డికి గుడ్‌బై చెప్పి చంద్రబాబుకు సలాం కొట్టబోతున్నారట ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే.

ఆయన కమ్మ సామాజివర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే. ఎన్నో కోట్లు ఖర్చుపెడితే కానీ.. గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అటు ఎన్నికల ఖర్చు.. ఇటు ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి ఇచ్చిన విరాళం ఖర్చు తడిసి మోపెడు అయింది.

ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా.. కూడా ఆ సొమ్ముకు వడ్డీ కూడా సంపాదించుకోలేకపోయానని.. ఆ ఎమ్మెల్యే తన సన్నిహితులతో అంటున్నారట.వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం చంద్రబాబు ఇస్తానంటే.. ఆ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్దం అన్నట్లుగా గత వారం నుండి ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

పేరుకే అధికార పార్టీ ఎమ్మెల్యేను. జిల్లా స్థాయి అధికారులు ఎవరూ తనను పట్టించుకోవటం లేదని.. చివరకు నియోజకవర్గంలో కూడా తనను పరోక్షంగా అధికార పార్టీ ముఖ్యులు కొందరు ఇబ్బంది పెడుతున్నారని..ఆ ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులతో తెర వెనుక చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారట.

కోట్లు పోతే పోయాయి.. భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందో..? అప్పట్లో చంద్రబాబు పై వ్యతిరేకతతో జగన్‌ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించాను. తాజా పరిస్థితులు తారుమారుఅ య్యాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తనకు ఓటు వేసిన కమ్మ సామాజకివర్గ ఓటర్లలో మెజార్టీ ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు.

మరో వైపు రెడ్డి సామాజికవర్గం మినహా మిగతా అగ్ర కులాల ఓటర్లు అదికార పార్టకి వ్యతిరేకం అయ్యారు. ఇలాంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్న నేపధ్యంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. తనకు పోటీచేసే అవకాశం చంద్రబాబు కల్పిస్తాననని. హామీ ఇస్తే.. అధికార పార్టీని వీడి టిడిపిలో చేరతానంటున్నారు ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే.

Leave A Reply

Your email address will not be published.