Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

సమంత న్యూ ఇయర్ గిఫ్ట్

ఇన్నాళ్లూ వెండితెర మీద మెరిసిన అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం డిజిటిల్ వేదిక మీద దృష్టి సారించింది. ప్రముఖ ఓటీటీ `ఆహా` కోసం సమంత నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో `సామ్ జామ్` మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఇక, కొత్త సంవత్సరంలో సమంత తన అభిమానులకు మరో బహుమతి అందించబోతోంది.

- Advertisement -

సమంత కీలక పాత్ర పోషించిన వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మేన్-2` కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఈ వెబ్ సిరీస్‌లో సమంత నెగిటివ్ రోల్‌లో కనిపించబోతోంది. తీవ్రవాది పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. రాజ్-డీకే ద్వయం రూపొందించిన `ఫ్యామిలీ మేన్` వెబ్ సిరీస్ తొలి భాగం మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా త్వరలో `ఫ్యామిలీ మేన్-2` రాబోతోంది.

Leave A Reply

Your email address will not be published.