బిజినెస్ మెన్ తో సింగర్ సునీతకు నిశ్చితార్థం !
ప్రముఖ సింగర్ సునీత వివాహం పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఆ రూమర్లకు క్లారిటీ ఇచ్చారు సునీత. ఈ మేరకు డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్ రామ్ వీరప్పనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత ఏమోషల్ గా స్పందించారు. ‘అందరి తల్లిలాగే నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మంచిగా స్థిరపరచాలని కలలు కంటున్నాను. అలాగే నా పిల్లలు కూడా నన్ను జీవితంలో బాగా స్ధిరపరచాలని కోరుకున్నారు.
- Advertisement -
అలాంటి అద్భుతమైన పిల్లలు ఉన్నందుకు అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. చివరికి ఆ క్షణం వచ్చింది. నా జీవితంలోకి మంచి స్నేహితుడిగా వచ్చిన రామ్ భాగస్వామిగా మారనున్నాడు. మేము ఇద్దరం త్వరంలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాము. నా జీవిత విషయాలను రహస్యంగా ఉంచుతున్నానని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.. ఎప్పటిలాగే నన్ను ఆదరించి, మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా.’ అంటూ సునీత ఎమోషనల్ అయ్యారు.