Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుండి తప్పించకుంటే.. !

సోము వీర్రాజును పదవి నుండి తప్పించాలని.. జనసేనాదిపతి వపన్‍ కళ్యాణ్‍ కోరుతున్నారు. తెలంగాణ ఎంపీలు కూడా సోమును తప్పించకుంటే.. ఆ ప్రభావం హైదరాబాద్‍పై పడుతుందంటున్నారు. రాష్ట్ర బిజెపి నేతలలో ఐదారుగురు మినహా మిగతా వారందరూ చంద్రబాబుకు అనుకూలంగా లేకున్నా.. సిఎం జగన్‍ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలా వ్యతిరేకిస్తున్న వారందరూ సోమును ఎంత తొందరగా అధ్యక్ష పదవి నుండి తప్పిస్తే.. అంత తొందరగా పార్టీ బలం పెరుగుతందని వారు అంటున్నారు. సిఎం జగన్‍ రెడ్డికి అనుకూలంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా విమర్శలు, ఆరోపణలు చేసి తన గొయ్యి తానే తవ్వుకోబోతున్నానని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కొనసాగినంత కాలం ఆయనను ఏ సామాజికవర్గ నేతలు వ్యతిరేకించేవారు కాదు.

- Advertisement -

అకారణంగా కన్నాను తప్పించి సోము వీర్రాజును బిజెపి అధ్యక్షుడిగా నియమించిన నాటి నుండి జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న సోము వ్యతిరేక, అనుకూల వాదులు తెర వెనుక మాట్లాడుతూ ఇక రాష్ట్రంలో బిజెపికి పూర్తిగా నూకలు చెల్లినట్లే అంటున్నారు. 2019 ఎన్నికలలో నోటాకు పోలైన ఓట్లు కూడా బిజెపి అభ్యర్ధులకు పోల్‍ కాలేదు. అప్పట్లో చంద్రబాబును ఓడించటమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర, రాష్ట్ర బిజెపి నేతలు జగన్‍ పార్టీ అభ్యర్ధులకు ఓటు వేయాల్సిందిగా తమ ఓటర్లకు రహస్యంగా సందేశాలు పంపారు. అందుకు మూల్యం చెల్లించుకున్నారు. కన్నానే బిజెపి అధ్యక్షుడిగా కొనసాగించినట్లయితే.. పార్టీ కొంత బలం పుంజుకునేది. సోమును నియమించాక మొదట్లో ఆయనకు మద్దతిచ్చిన కొంత మంది నేతలు తాజాగా ఆయన వ్యవహారశైలి నచ్చక పరోక్షంగా సోమును దుయ్యబడుతున్నారు. నిత్యం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలకే పరిమితం అవుతున్న సోము వీర్రాజును ఆయనకు మద్దతిస్తున్న నేతలు కూడా తప్పుబడుతున్నారు. అంతే కాకుండా జనసేనాదిపతి పవన్‍ కళ్యాణ్‍ కూడా సోము వీర్రాజు వ్యవహరశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో బిజెపి బలం పుంజుకోవాలంటే.. ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలను ఎండగట్టాలే తప్ప ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. పరోక్షంగా జగన్‍ రెడ్డి ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లుగా మెజార్టీ ఓటర్లు భావిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర బిజెపి పెద్దలు వాస్తవాలు తెలుసుకుని సోమును తప్పించకుంటే.. అంతంత మాత్రంగా ఉన్న బిజెపి బలం మరి కొద్ది రోజులకు భూస్థాపితం కావటం అంటున్నారు పార్టీ నేతలు.సోము వీర్రాజును బిజెపి అధ్యక్షుడిగా మరి కొంత కాలం కొనసాగితే.. హైదరాబాదులో సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మళ్లీ టీఆర్‍ఎస్సే బలపడుతుందంటున్నారు. బిజెపి నేతలలో ఐదారుగురు మినహా మిగతా వారందరూ సోముకు వ్యతిరేకులయ్యారు. ఆయనను ఎంత తొందరగా అధ్యక్ష పదవి నుండి తప్పిస్తే.. పార్టీకి అంత మంచిదంటున్నారు. రెండు మూడు రోజుల నుండి సోము వీర్రాజు సిఎం జగన్‍ రెడ్డి ప్రభుత్వంపై మొక్కుబడిగా విమర్శలు చేస్తున్నట్లుగా ఆయన చేస్తున్న ఆరోపణలను బట్టి స్పష్టమవుతోందంటున్నారు బిజెపి నేతలు.

Leave A Reply

Your email address will not be published.