Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

అల్లుడు ఐఎఎస్‍ బలహీనతలు.. మామకు కాసుల పంటలు..!

ఆయన పేరుకే రాజు.. పెత్తనమంతా మంత్రిదే అన్న పాతకాలపు సినిమా కద తాజాగా తెరపైకి వచ్చింది. ఆయన మాట్లాడితే నోటి నుండి ముత్యాలు రాలుతాయట. పేరుకే రాజు. పెత్తనమంతా దగ్గర బందువుదే. ఇంకేముంది ఆ బందువు అడ్డూ అదుపు లేకుండా కలెక్షన్లపైనే దృష్టి పెట్టడంతో ఆ విషయం కధలు కధలుగా ప్రచారం అయింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకిపోయింది.

అసలు విషయం తెలిసినా కూడా ఏమీ తెలియనట్లు వ్యవహారం నడుస్తూనే ఉంది. పిల్లనిచ్చిన మామ రిటైర్డు ఐఎఎస్‍ అధికారి.. పిల్లను చేసుకున్న అల్లుడు తాజా ఐఎఎస్‍ అధికారి. అంతే కాదు.. చాలా ఉన్నత స్థానంలో ఆ ఐఎఎస్‍ అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అల్లుడు ఐఎఎస్‍ అధికారికి మంచి వాడిగా పేరుంది.ఆ ఐఎఎస్‍కున్న బలహీనతలను అనుకూలంగా మలుచుకుని కలెక్షన్‍లపై దృష్టి పెట్టారు.. మామ రిటైర్డు ఐఎఎస్‍ అధికారి.

- Advertisement -

మా అల్లుడు ఐఎఎస్‍తో పని ఉంటే మా దగ్గరకు రండి.. ఎలాంటి పనులైనా చక్కపెడతాను… కానీ ముందుగా 75శాతం అడ్వాన్సు ఇవ్వాలి. మిగతా 25శాతం సొమ్ములు పని అయ్యాక ఇవ్వాలని రిటైర్డు ఐఎఎస్‍ మామ షరతులు విధిస్తున్నారట. మామ ఐఎఎస్‍ సర్వీసులో ఉన్నంత కాలం నోరు తెరిచి బయట పడకుండా అప్పటి పాలకులను నమ్మించి బాగానే వెనకేసుకున్నారట.

ఐఎఎస్‍ అధికారి అల్లుడు కావటంతో రిటైర్డు అయిన మామకు కాసుల పంట కురిపిస్తుందట. అల్లుడు ఎక్కడ పనిచేసినా.. మామ రిటైర్డు ఐఎఎస్‍ ఆ ప్రాంతానికి వెళ్లి కలెక్షన్ల దుకాణం తెరుస్తున్నారట. అల్లుడు ఐఎఎస్‍ దగ్గర ఏ పని ఉన్నా.. ఆయనను స్వయంగా కలవనక్కర్లేదు. మామ రిటైర్డు ఐఎఎస్‍ను స్వయంగా కలిసి సొమ్ములు ముట్టచెబితే.. ఆఘమేఘాలపై పనులు అయిపోతున్నాయట.

ప్రభుత్వాలు మారినా.. ఆ ఐఎఎస్‍ అధికారికి కీలక ప్రాధాన్యత పోస్టులు దక్కుతున్న నేపధ్యంలో మామ రిటైర్డు ఐఎఎస్‍ అధికారి పని మూడు పూలు ఆరు కాయలుగా ఉందట. ఆ ఐఎఎస్‍ అధికారి ఎక్కడ పనిచేసినా.. మంచి అధికారి అని పేరు తెచ్చుకున్నప్పటికీ… వ్యక్తిగత బలహీనతలు, కుటుంబపరమైన బలహీనతలకు తలొగ్గి.. మామ సిఫార్సులను ఆఘమేఘాలపై ఆమోదిస్తూ.. తనకున్న పరువు ప్రతిష్టలను స్వయంకృతాపారాధాలతో మంట గలుపుకుంటున్నారు ఆ ఐఎఎస్‍ అధికారి.

Leave A Reply

Your email address will not be published.