Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

టిటిడి ఛైర్మన్‍ పదవి పొడిగింపు ఒద్దట..! రాజ్యసభే వైవికి ముద్దట..!!

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‍గా బాధ్యతలు నిర్వహిస్తున్న వైవి.సుబ్బారెడ్డి పదవీ కాలం మరి కొద్దిరోజులలో ముగియబోతున్న నేపధ్యంలో .. తనకు ఛైర్మన్‍ పదవి పొడిగింపు అవసరం లేదని.. పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని.. సుబ్బారెడ్డి బాహాటంగా చెప్పిన నేపధ్యం వెనుక రాజకీయ లబ్ది కోసమే అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. 2022 మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో తనకు రాజ్యసభ సీటు తప్పకుండా లబిస్తుందన్న నమ్మకంతో వైవి.సుబ్బారెడ్డి ఉన్నట్లు తెలిసింది.

టిటిడి ఛైర్మన్‍గా మరో రెండేళ్లు కొనసాగినా చేసేది ఏమీ లేదని.. రాజకీయంగా ఇప్పటికే దెబ్బ తిన్నానని.. వైవి.సుబ్బారెడ్డి తన సన్నిహితులతో తెర వెనుక చెబుతున్నట్లు బయటకు పొక్కింది. 2014 ఎన్నికలలో తాను ఎంపీగా ఒంగోలు నుండి విజయం సాధించినప్పటికీ.. 2019లో మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా.. అప్పటికప్పుడు పార్టీలో చేర్చుకున్న మాగంటి శ్రీనివాసరెడ్డికి జగన్‍ రెడ్డి పోటీ చేసే అవకాశం ఇచ్చినా.. ఎలాంటి విమర్శలు చేయలేదు.

- Advertisement -

ఏ విధంగానూ తప్పుబట్టలేదు. మౌనంగానే అవమానాన్ని భరించాను. పార్టీ కోసం నేను పదవి త్యాగం చేశానని సుబ్బారెడ్డి అనేక సందర్భాలలో అంటుండేవారు. 2019 ఎని్న కలలో అయోధ్యరామిరెడ్డికి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా… మరొకరికి ఇచ్చిన నేపధ్యంలో ఆయనను 2020లో రాజ్యసభకు ఎంపిక చేసిన విధంగా తనను 2022లో రాజ్యసభకు ఎంపిక చేస్తారన్న నమ్మకంతో సుబ్బారెడ్డి ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. టిటిడి ఛైర్మన్‍ పదవి కన్నా.. రాజ్యసభ పదవే ఎంతో మిన్న అని వైవి.సుబ్బారెడ్డి భావిస్తున్నారట.

ఆయనకు తప్పకుండా రాజ్యసభ సీటు దక్కుతుందంటున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన అధికార నేతలు. సుబ్బారెడ్డి పార్టీకోసం త్యాగం చేశారని.. ఆయనను రాజ్యసభకు ఎంపిక చేయాలని సిఎం జగన్‍ రెడ్డి కూడా భావిస్తున్నట్లు ప్రకాశం జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.