Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

అధికార ఎంపీలపై నిఘా..?

అధికార పార్టీకి చెందిన లోక్‍సభ సభ్యుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు పలువురు ఎంపీలకు అనుమానం కలిగిందని, మరి కొంతమందికి సమాచారం అందిందని ఎంపీలు తమ సన్నిహితులతో చెబుతూ ఫోన్లు ఎక్కువగా మాకు చేయవద్దు. ఒకవేళ ఫోన్‍ చేసినా.. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు. ఏదైనా ముఖ్యమైన సమాచారం తెలపాలనుకుంటే వాట్సాప్‍ ఫోన్‍ ద్వారా మాట్లాడండి అని పలువురు ఎంపీలు తమకు అత్యంత సన్నిహితులైన నాయకులకు, కార్యకర్తలకు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు కొందరి ఎంపీలపై నిఘా పెట్టిన ప్రభుత్వం తాజాగా మరి కొంతమందిని ఆ జాబితాలోకి చేర్చిందని పలువురు ఎంపీలే తమ సన్నిహితులకు చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

- Advertisement -

ఎంపీలుగా గెలిచి సంవత్సరం పూర్తయింది. ఇప్పటి వరకు ఏ అభివృద్దిని చేయలేకపోయాం.. వ్యక్తిగత పని ఉండి కానీ.. లేదా ఫంక్షన్‍లకు కానీ గ్రామం వెళితే.. ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. మాకు తెలియకుండా.. మాకు సమాచారం ఇవ్వకుండా… మా నియోజకవర్గ పరిదిలోకి మీరు రావటం ఏమిటి అని నిలదీస్తున్నారట. ఎవరికీ ఫింఛన్లు ఇప్పించకూడదు. అధికారులు, ఉద్యోగుల బదిలీలో కల్పించుకోకూడదు. తమకు పరిచయం ఉన్న ఉద్యోగులకు అన్యాయం జరిగితే సరిదిద్దకూడదట. స్థానిక ఎమ్మెల్యేలను సంప్రదించి పైన పేర్కొన్న పనులు చేయాలట. ఒక్కొక్క ఎంపీ ఎన్నెన్ని కోట్లు ఖర్చు పెట్టారో.. ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారికి ఎన్నెన్ని కోట్లు ఇచ్చారనే విషయం ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు మరిచిపోయారేమో అని వారి సన్నిహితులు అంటున్నారు..

ఎంపీ పోస్టు అంటే ఢిల్లీలోనే ఉండాలి.నియోజకవర్గాలకు రాకూడదు. ఒక వేళ వచ్చినా తాము వ్యతిరేకించేవారిని కలవకూడదు. మాట్లాడకూడదు. ఈ విధంగా ఎమ్మెల్యేలు చేస్తుంటే వారిని తప్పుబట్టిన వారిపై అసమర్ధ ముద్ర వేస్తున్నారు. ఈ సంవత్సరంలో ఎంతమంది ఎంపీలు నియోజకవర్గాలలో పర్యటించారు. ఎన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. అని పలువురు ఎంపీలు ప్రశ్నించుకుంటున్నారట. ఎదురు తిరిగి మాట్లాడితే.. ఎంపీలు పార్టీ మారబోతున్నారు అని ముద్ర వేస్తున్నారు. ఇన్నేళ్ల తమ రాజకీయ జీవితంలో అధికార పార్టీ ఎంపీలకు ఇంత దారుణమైన పరిస్థితులు ఏనాడు ఎదురు కాలేదట. తాజాగా ఎదురవుతున్నాయి. అందుకు కారణాలు ఏమైనప్పటికీ.. ఎంపీలంటే వారికి నియోజకవర్గాలతో సంబందం లేదనే వ్యాఖ్యలు ఎమ్మెల్యేలు చేస్తున్నారు. అటో.. ఇటో.. తేల్చుకోవాల్సిందే అని కొంతమంది ఎంపీలు బాహాటంగా బయట పడుతున్నారు. దీంతో ఎంపీల ఫోన్లపై నిఘా పెట్టినట్లు బయట పడిన నేపధ్యంలో మెజార్టీ అధికార పార్టీ ఎంపీలు వాట్సాప్‍ ఫోన్ల ద్వారానే మాట్లాడుతూ సరిపెడుతున్నారట

Leave A Reply

Your email address will not be published.