Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మంత్రి పదవి నిర్వహించాకే.. రాజకీయాలకు తమ్మినేని గుడ్‍ బై..!

ఇదే ఆఖరి సారి ఎన్నికలలో పోటీ చేస్తున్నాను. భవిష్యత్తు ఎన్నికలలో మళ్లీ పోటీ చేయను.. ఈ ఒక్కసారి నన్ను గెలిపించండి.. జగన్‍ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు.. నాకు మంత్రి పదవి ఇస్తారు.. అని 2019 ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రాదేయ పడిన తమ్మినేని సీతారాంను అఖండ మెజార్టీతో ఓటర్లు గెలిపించినా.. సిఎం జగన్‍ రెడ్డి తమ్మినేనికి మంత్రి పదవి ఇవ్వలేకపోయినా.. అత్యంత ప్రాధాన్యత గల శాసనసభాపతి పదవిని ఇచ్చి గౌరవించారు. మంత్రి పదవిని ఆశిస్తే.. శాసనసభాపతి పదవి లభించింది.

రెండున్నరేళ్ల్లు ఆ పదవిలో ఉండి ఆ తరువాత మంత్రి పదవి కావాలని సిఎం జగన్‍ రెడ్డిని కోరతాను. ఆయన తప్పకుండా నాకు మంత్రి పదవి ఇస్తారని తమ్మినేని సీతారాం ఆయన అనుచురులతో అప్పుడప్పుడు చెబుతుంటే వారట. మళ్లీ ఎన్నికలలో పోటీ చేయను.. శాసనసభాపతి పదవితో నాకు తృప్తికలగలేదు. గతంలో తొమ్మిదేళ్లు మంత్రి పదవి నిర్వహించినా.. ఆ తరువాత 15ఏళ్లు రాజకీయంగా అన్ని పదవులకు దూరం కావాల్సి వచ్చింది.

- Advertisement -

అలాంటి పరిస్థితి ఎదుర్కొన్న తనకు మంత్రి పదవి ఇవ్వాలని సిఎం జగన్‍ రెడ్డిని స్వయంగా కలిసి కోరాలని శాసనసభాపతి తమ్మినేని సీతారం భావిస్తునట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చంద్రబాబుపై విమర్శలు,ఆరోపణలు పదే పదే చేస్తున్న తమ్మినేని సీతారాం కోరికను సిఎం జగన్‍ రెడ్డి నెరవేరుస్తారా..? శాసనసభాపతి పదవిలో ఉండి రాజకీయంగా చంద్రబాబు, నారా లోకేష్‍లపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. సిఎం జగన్‍ రెడ్డికి తృప్తి కలిగిస్తున్న తమ్మినేని సీతారాంకు మంత్రి పదవి తప్పకుండా లభిస్తుందని.. ఆయన అనుచరుల అంటున్నారు.

ప్రత్యక్ష ఎన్నికలలో ఇక పోటీ చేయను.. ఒకసారి మంత్రి పదవి ఇస్తే.. గౌరవంగా ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటాను. నా తరువాత నా కుమారుడు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికలలో పోటీ చేస్తారు అని తమ్మినేని అధికార ప్రజాత్రినిధులతో తెర వెనుక చెప్పినట్లు ప్రచారం జరిగింది. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా.. తనకు మంత్రి పదవి ఇస్తారన్న నమ్మకం తమ్మినేనికి ఉంది. మంత్రి పదవి నిర్వహించి క్రియాశీలక రాజకీయాలనుండి తప్పుకోవాలన్న కోరికను సిఎం జగన్‍ రెడ్డి నెరవేరుస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.