తెలంగాణ కోడలు షర్మిల.. పులివెందులలో ఓటు వేయటం ఏమిటి..?
రాజన్న బిడ్డను.. తెలంగాణ కోడలిని అని నూతన సెంటిమెంటును తెరపైకి తీసుకు వచ్చి త్వరలో ప్రాంతీయ పార్టీని స్థాపించాలనుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముద్దుల చెల్లెలు షర్మిల 2019 ఎన్నికలలో ఎక్కడ తాను ఓటు వేశారో ఆమె మరిచిపోయినా.. షర్మిల ఓటు వేసిన ప్రాంత ప్రజలు మరిచిపోలేదు.
పోలింగ్ బూత్‌లో బాధ్యతలు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులు మరిచిపోలేదు. 2019 ఎన్నికలలో ఆమె పులివెందుల నియోజకవర్గంలోని ఒక బూత్‌లో ఆమె ఓటు వేసినట్లు సోషల్ మీడియాలో వీడియో ప్రచారం అవుతోంది. ఆమె ఓటు వేసిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. రాజన్న ముద్దు బిడ్డ.. జగనన్న ముద్దుల చెల్లెలుగా షర్మిల పులివెందులలో ఓటు వేశారే తప్ప తెలంగాణ కోడలు అని చెప్పుకుంటున్న షర్మిల ఆమె భర్త నివాసం ఉంటున్న ప్రాంతంలో ఎందుకు ఓటు వేయలేకపోయారు.
తెలంగాణ కోడలికి పులివెందుల నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఓటు ఎందుకు ఉంది. ఎన్నో సంవత్సరాల కిందట పులివెందులలో ఓటు నమోదు చేసుకున్న షర్మిల.. తెలంగాణ కోడలు అని చెప్పుకుంటున్న ఆమె భర్త నివాసం ఉంటున్న ప్రాంతంలో ఎందుకు ఓటు చేర్చుకోలేకపోయారు. అప్పుడేమో అన్న జగన్ రెడ్డికి ఓటు వేయాలి.. ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆమె కోరుకున్నారు.
- Advertisement -
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తనను పట్టించుకోలేదని.. తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని.. తనను రాజ్యసభకు పంపలేదని.. తనకన్నా భార్య భారతికే జగన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని.. అనుభవంతో తెలుసుకున్న షర్మిల రాజన్న బిడ్డగా తెలంగాణలో పార్టీని స్థాపించాలనుకోవటంలో మర్మం ఏమిటి..?
తెలంగాణ కోడలు అని చెప్పుకుంటున్న షర్మిల.. తెలంగాణలో ఎందుకు ఓటు చేర్చుకోలేదు. దీనర్ధం పరమార్ధం ఏమిటంటే.. తనకు భర్త ఉండే నివాసం కన్నా.. జగన్ అన్న నియోజకవర్గంలో ఓటు వేయటమే మిన్నగా భావించినట్లేకదా..? తెలంగాణ బిడ్డల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందే తప్ప రాజన్న బిడ్డ కోసం కాదని.. ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ప్రభావం ఆ ప్రాంత ప్రజలలో ఎంత వరకు పనిచేసిందో కానీ 2019 ఎన్నికలలో పులివెందులలో ఓటు వేసిన షర్మిల తెలంగాణ ప్రాంత కోడలిగా ఆమె అనుకోవటం లేదని స్పష్టం అవటం లేదా..?
ఓటు పులివెందులలో.. పార్టీ పెట్టేది తెలంగాణలో.. రేపో మాపో ఈ విషయం బయటకు పొక్కి వివిధ రాజకీయ పార్టీల నేతలు 2019 ఎన్నికలలో షర్మిల ఎక్కడ ఓటు వేశారో అనే విషయం బయట పడితే.. ఆమె ఏ విధంగా సమాధానం చెప్పుకోలుగుతారు. తెలంగాణ కోడలి కన్నా.. రాయలసీమ ఆడపడుచుగానే షర్మిల భావించారని… స్పష్టం అవుతోందని.. దీనిని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని ఆప్రాంత నేతలు రేపో మాపో బయట పెట్టే అవకాశం ఉంది.