Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

కొడాలికి చుక్కలు చూపించబోతున్న తెలుగుతమ్ముళ్లు..!

ముఖ్యమంత్రిజగన్‍ రెడ్డిని సంతృప్తి పరిచేందుకు ఐదేళ్లు మంత్రి పదవిలో ఉండేందుకే… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాలోకేష్‍లపై మంత్రి కొడాలి నాని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని.. మంత్రి నానికి చుక్కలు చూపించి.. ఆయన నోటికి తాళం వేయాలని.. ఏదో విధంగా రాజకీయంగా దెబ్బ కొట్టాలని తెలుగుతమ్ముళ్లు తెరపైకి రాబోతున్నారు.

మంత్రి కొడాలి నాని దూకుడుకు అడ్డు కట్ట వేయకుంటే.. ఆయన మరింత రెచ్చిపోతారని… ఇప్పటికే మంత్రి కొడాలి నాని మాటలను మెజార్టీ ప్రజలు అసహ్యించుకుంటున్న విషయం అందరికీ తెలుసు. ఈ నేపధ్యంలో మంత్రి కొడాలి నానిని ఇరుకున పెట్టి ఆయనను మౌనం వహించేట్లుగా కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలిసింది.

- Advertisement -

కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని మంత్రి నాని బాగోతాలను బయటకు తీసేందుకు గుడివాడ నియోజకవర్గ ప్రాంతంలో ఉండే తమ బందువులు, సన్నిహితుల నుండి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు చంద్రబాబు, లోకేష్‍లపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా ఓపిగ్గా భరించాం.. మా ఓపికను చేతకాని తనంగా మంత్రి కొడాలి నాని భావిస్తున్నారు.

ఇక ముందుంది ముసళ్ల పండుగ అన్నచందంగా మంత్రిని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేందుకు తెలుగుతమ్ముళ్లు కొందరు రహస్యంగా సమావేశం అయి ఎవరెవరుఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించినట్లు తెలిసింది.కనీసం పదో తరగతి కూడా చదవని మంత్రి కొడాలి నాని మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని సిఎం జగన్‍ మెప్పు పొందేందుకు జగన్‍ భజన చేస్తున్నారన్న విషయం జగమెరిగిన సత్యం అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

ఇక నుండి చంద్రబాబు, లోకేష్‍లపై మంత్రి కొడాలి నాని విమర్శలు,ఆరోపణలు చేస్తే.. వెంటనే జిల్లాల వారీగా స్పందించి మంత్రిని గుక్క తిప్పుకోనివ్వకుండా రాజకీయంగా చుక్కలు చూపించటానికి తెలుగుతమ్ముళ్లు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Leave A Reply

Your email address will not be published.