Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

తండ్రి కన్నా.. నాలుగు ఆకులు ఎక్కువే చదివిన తమ్మినేని తనయుడు..!

ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.. ఆవు గట్టు మీద ఉంటే.. దూడ కూడా గట్టు మీద మేస్తుంది.. ఇది పాత కాలం సామెత. దానిని ఆచరణలో రుజువు చేస్తున్నారు.. శాసనసభాపతి తమ్మినేని సీతారాం రాజకీయ వారసుడు, కుమారుడు తమ్మినేని నాగ్‍. శాసనసభాపతి ఎలా ఉండాలో.. గతంలో ఆ పదవి నిర్వహించిన వారు ఆచరణలో చూపిస్తే.. మాజీ శాసనసభాపతులది తప్పు.. శాసనసభాపతి అంటే నాలా ఉండాలి.. శాసనసభ సమావేశంలో మాత్రమే శాసనసభాపతిగా కనిపించాలి.

శాసనసభ సచివాలయ అధికారులకు, ఉద్యోగులకు బాస్‍గానే ఉండాలి. మొదట నేను జగన్‍ పార్టీ సభ్యుడిని. ఆ తరువాత జగన్‍ పార్టీ ఎమ్మెల్యేను. చివరకు శాసనసభాపతిని. నన్ను కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా గుర్తించుకోవాల్సిందే అని కొత్త ఒరవడిని తెరపైకి తీసుకు వచ్చిన ఘనత తమ్మినేనికే దక్కింది.

న్యాయస్థానం తీర్పును తప్పుబట్టినా.. న్యాయమూర్తులపై పరోక్ష విమర్శలు, అభ్యంతరకరవ్యాఖ్యలు చేసినా.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు చేసినా.. ఆమదాలవలస అధికార పార్టీ శాసనసభ్యుడిగానే తాను విమర్శలు చేశానంటున్నారు తమ్మినేని. ఆయన ఏకైక కుమారుడు, రాజకీయ వారసుడిగా ప్రచారంలో ఉన్న తమ్మినేని నాగ్‍ కూడా తండ్రి కన్నా ఎక్కువ దూకుడుగా ముందుకు వెళుతున్నారు.

- Advertisement -

ఆమదాలవలసకు మాత్రమే తమ్మినేని నాగ్‍ పరిమితం అవుతుండటంతో..ఆయన అక్కడ ఏం చేస్తున్నారనే విషయాలు బయట పెట్టడంలో తెలుగుదేశం నేతలు ఘోరంగా విఫలం అయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస శాసనసభ్యుడు తమ్మినేని సీతారాం బాటలోనే ఆయన కుమారుడు చిరంజీవి నాగ్‍ నడుస్తున్నారు. నిన్న కాక మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికలలో విపక్షాలు విజయం సాధించిన గ్రామ పంచాయితీలలో ప్రజాస్వామ్యంగా వ్యవహరించకపోతే అందుకు మూల్యం చెల్లించుకుంటారు.

మీరు పేరుకే గ్రామ సర్పంచ్‍లు. అధికారం చెలాయించేది మేమే తస్మాత్‍ జాగ్రత్త అని టిడిపి పంచాయితీ సర్పంచ్‍లను బాహాటంగానే నాగ్‍ హెచ్చరించారు. అందుకు సంబందించిన వీడియో సోషల్‍ మీడియాలో ప్రచారం అవుతోంది. నాగ్‍ వ్యాఖ్యలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మా నాగ్‍.. తండ్రి తమ్మినేని సీతారాం కన్నా చాలా పవర్‍ ఫుల్‍ అని అధికార నేతలు, అమాత్యుల కుటుంబసభ్యులు, అధికార ప్రజాప్రతినిధులు గొప్పగా చెబుతున్నారట.

పేరుకే మీరు పంచాయితీ సర్పంచ్‍లు.. అధికారం చెలాయించేది.. పెత్తనం చేసేది మేమే.. జాగ్రత్తగా ఉండండి అని నాగ్‍ హెచ్చరించటం వెనుక మర్మం ఏమిటంటే.. మాతో బాగుండండి.. మేము చెప్పిన పనులు చేయండి.. మీ పనులు కూడా మేము చేసిపెడతాం.. పరస్పరం సహకరించుకుందాం.. సహకరించకపోతే మీకే నష్టం అని టిడిపి సర్పంచ్‍లను పరోక్షంగా భయపెట్టారని టిడిపి కార్యకర్తలు అంటున్నారు

Leave A Reply

Your email address will not be published.