Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఆ మాజీ మంత్రికి జైలు భయం పట్టుకుందట..!

ఆ మాజీ మంత్రికి అపార రాజకీయ అనుభవంతో పాటు ఎన్నికలలో గెలుపు కన్నా ఓటమి అనుభవమే ఎక్కువగా ఉంది. పార్టీలో పది మందిపై పెత్తనం చేయాలని ఆ మాజీ మంత్రి అత్యుత్సాహం పడతారట. జిల్లాలో పార్టీలో నేనే సీనియర్‍.. నాకు అన్నీ తెలుసని.. ఒకరు నాకు చెప్పటం ఏమిటని.. అంటారట ఆ మాజీ మంత్రి. ఎన్నికలలో పదే పదే ఓడిపోయినా ఆ మాజీ మంత్రికి ఏదో విధంగా పదవులు లభిస్తూనే ఉన్నాయి.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బలహీనతలన్నీ ఆ మాజీ మంత్రికి తెలుసు. ఆ బలహీనతను అడ్డుపెట్టుకుని రాజకీయ అధికార లబ్ది పొందటంలో మిగతా వారి కన్నా ఆ మాజీ మంత్రి ముందుంటారట. ఇదంతా గతం. తాజాగా ఆ మాజీ మంత్రికి ఈ మధ్య కాలంలో జైలు భయం పుట్టుకువచ్చిందట. ఏ కారణాలతో జైలుకు ఆ మాజీ మంత్రిని సిఎం జగన్‍ రెడ్డి పంపుతారనే విషయం పక్కన పెడితే.. తనపై ఏదో ఒక బలమైన కేసు నమోదు చేయించి సిఎం జగన్‍ రెడ్డి జైలుకు పంపటం ఖాయమని ఆ మాజీ మంత్రికి నమ్మకమట.

- Advertisement -

ఆ మాజీ మంత్రికి ఎందుకు జైలుకు పంపుతారన్న అనుమానాలు వచ్చాయి అని ఆరా తీయగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను చిన్న కారణాలతో జైలుకు పంపారు. రేపో మాపో సిఎం జగన్‍ రెడ్డి నన్ను కూడా జైలుకు పంపినా ఆశ్చర్యపడక్కర్లేదు.. ఎందుకైనా మంచిదని.. జైలు జీవితం ఎలా ఉంటుంది.. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి.. మాజీ మంత్రులకు సౌకర్యంగా ఉండేందుకు ఒక గదిని గదితో పాటు ఎటాచ్‍డ్‍ బాత్రూం ఏర్పాటు చేస్తారా అని తనకు తెలిసిన అధికారుల ద్వారా వివరాలు తెలుసుకుంటున్నారట.

అంతే కాదు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను కలిసినప్పుడు ఆ మాజీ మంత్రి జైలు జీవితం ఎలా ఉంటుంది అని పదే పదే గుచ్చి అడిగారట. ఎన్నికలలో పదే పదే ఓడిపోతున్నా.. మెజార్టీ ఓటర్ల తిరస్కారానికి గురవుతున్నా.. ఏదో విధంగా పదవులను సంపాదించుకున్న ఆ మాజీ మంత్రి ఇటీవల కాలంలో తనను జగన్‍ రెడ్డి అరెస్టు చేయిస్తారన్న అనుమానంతో రాత్రిళ్లు కూడా నిదుర పోతున్నారో లేదో కానీ అదే వ్యాపకంతో కనిపిస్తున్నారట.

ఆ మాజీ మంత్రి పేరు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి. ఎన్నికలలో నాలుగు దఫాలు వరుసగా ఓడిపోయిన ఘన చరిత్ర సోమిరెడ్డికుంది. కదిలించి కయ్యాలు పెట్టుకోవటంతో మాజీ మంత్రి సో మిరెడ్డికున్న అనుభవం మరెవరికి లేదని అంటుంటారు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. సోమిరెడ్డిని జైలుకు సిఎం జగన్‍ రెడ్డి పంపరు అనుకుంటున్నారు ఆయన సన్నిహితులు. రాజ్యసభ సభ్యుడు అయిన వేమిరెడ్డి ప్రభాకర్‍రెడ్డి చంద్రమోహనరెడ్డికి దగ్గర బందవు.. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. తన బందువైన సోమిరెడ్డిని జైలుకు పంపకుండా వేమిరెడ్డి ప్రభాకర్‍ రెడ్డి ఒత్తిడి తేవటం ఖాయం అంటున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలు

Leave A Reply

Your email address will not be published.