Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఆ ఐఎఎస్‌ అధికారి బదిలీ వెనుక..!

ఐఎఎస్‌ అధికారి అంటే నిజాయితీగా, సమర్దవంతంగా బాధ్యతలు నిర్వహించాలి. కుల, మతాలకు అతీతంగా బాధ్యతలు నిర్వహించాలి. ఒక కులానికి చెందిన అధికారులు, ఉద్యోగులపై ‘కుల’పరమైన వేదింపులు, సాదింపులకు పాల్పడకూడదు. పాలకుల అండదండలున్నాయని.. ఉన్నతాధికారుల ఆశీస్సులున్నాయని.. రెచ్చిపోతే.. తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న చందంగా.. తన గోతిని తానే తవ్వుకునే పరిస్థితులు ఆ అధికారులకు ఎదురవుతాయి.

అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. తమ అక్రమ సంపాదన వివరాలు బయట పడినా.. ఆ అధికారి పలానా కులానికి వ్యతిరేకం.. పలానా కులానికి అనుకూలం అని మంత్రులు, పాలకులు అని భావిస్తే.. అలాంటి విషయాలపై కొందరు అధికారులు రెచ్చిపోతుంటారు.

- Advertisement -

అసలు విషయానికి వస్తే..ఒక ప్రాధాన్యత హెచ్‌వోడీ శాఖాదిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఐఎఎస్‌ అధికారిని ఇటీవలె ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ అధికారి గతంలో రాజ్యాంగపరమైన పదవి నిర్వహిస్తున్న ముఖ్యవ్యక్తి కార్యాలయంలో కూడా పనిచేశారు. ఆ తరువాత ప్రాధాన్యతగల హెయ్‌వోడీ శాఖాదిపతిగా నియమించటం వెనుక ఆ ముఖ్యనేత సిఫార్సు పనిచేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

ఆ శాఖహెచ్‌వోడీగా బాధ్యతలు స్వీకరించాక.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు చేయటమే కాకుండా..ఆయన సామాజికవర్గానికి చెందిన అధికారులను ఉద్యోగులను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడటమే కాకుండా.. ‘కుల’పరంగా దూషించేవారని.. బయటకు పొక్కింది. అంతే కాకుండా.. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధికారులు, ఉద్యోగులను కూడా చిన్నచూపు చూస్తున్నారని… కొంతమంది అధికార ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లటంతో ఆ అధికారిని ఆఘమేఘాలపై బదిలీ చేయటం జరిగింది.

సిఎం జగన్‌ రెడ్డి ఆశీస్సులునాకున్నాయి. సిఎంవో అధికారి అండదండులున్నాయి. మా శాఖాదిపతి పట్టించుకోరు.. నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని.. ఆ అధికారి రెచ్చిపోయి అందుకు మూల్యం చెల్లించుకున్నారని.. ఆ శాఖలో అదికారులు, ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఆ శాఖలో ప్రతి పనికి లక్షలు ఆ అధికారి లక్షలు డిమాండ్‌ చేస్తున్న విషయం కూడా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఇదే విషయాన్ని ఆ శాఖాదిపతి కూడా సిఎంవో అధికారి దృష్టికి తీసుకెళ్లటంతో ఆ అధికారిని బదిలీ చేసి తిరిగికోలుకోలేనంతగా ఆ ఐఎఎస్‌ అధికారికి షాక్‌ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.