Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

తిరుపతి ఉప ఎన్నిక సోమిరెడ్డికి అగ్ని పరీక్షే..!

తిరుపతి లోక్‍సభకు ఉప ఎన్నిక రావటం.. అటు సిఎం జగన్‍ రెడ్డికి.. ఇటు మాజీ సిఎం చంద్రబాబుకు రాజకీయంగా ఉత్కంఠ కలిగించబోతుంది. 2019 ఎన్నికలలలో రెండు లక్షల 28వేల మెజార్టీతో జగన్‍ పార్టీ అభ్యర్ధి విజయం సాధించారు.ఈ ఉప ఎన్నికలో కనీసం 3 నుండి 5లక్షల లోపు మెజార్టీ రావాలని అధికార ఎమ్మెల్యేలకు, అమాత్యులకు సిఎం జగన్‍ రెడ్డి టార్గెట్‍ విధించారని ప్రచారం జరుగుతోంది.

గతంలో వచ్చిన రెండు లక్షల 28వేల మెజార్టీని ఏదో విధంగా తగ్గించగలిగితే.. రాజకీయంగా జగన్‍ రెడ్డిని దెబ్బకొట్టవచ్చునని చంద్రబాబు ఆశపడుతున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‍ రెడ్డిపరిస్థితి దారుణంగా ఉంది. ఈ సారైనా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లిలో టిడిపి అభ్యర్ధికి మెజార్టీ రాకుంటే.. సోమిరెడ్డి భవిష్యత్తు అంధకారమే. ఆయనను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేఅవకాశాలున్నాయని.. పలు రాజకీయ నేతల అభిప్రాయం.

- Advertisement -

తిరుపతి లోక్‍సభకు ఉప ఎన్నిక జరగబోతున్న నేపధ్యంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‍ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు అగ్ని పరీక్ష ఎదురు కాబోతుంది. తిరుపతి లోక్‍సభ పరిదిలోని ఏడు నియోజకవర్గాలలో మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గం కూడా ఉంది.

ఎన్నికలలో ఓటమి వీరుడుగా పేరు తెచ్చుకున్న సోమిరెడ్డికి ఈ సారైనా సొంత నియోజకవర్గమైన సర్వేపల్లి ఓటర్లు మళ్లీ షాక్‍ ఇస్తారా..? అయ్యో పాపం అని జాలి చూపి చంద్రమోహన్‍ రెడ్డికి ఓటు వేస్తారా..? నాలుగు దఫాలు వరుసగా ఎన్నికలలో ఓడిపోయిన సోమిరెడ్డికి ఈ సారైనా సర్వేపల్లి ప్రజలు మద్దతివ్వకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారమే అని క్రియాశీలక రాజకీయాలనుండి సోమిరెడ్డి గౌరవంగా తప్పుకుంటే హుందాతనంగా ఉంటుందని.. ఒకవేళ చంద్రమోహన్‍ రెడ్డి ఆ పనిచేయకుంటే.. చంద్రబాబు అయినా.. మాజీ మంత్రి సోమిరెడ్డిని రాజకీయంగా ప్రాదాన్యత తగ్గించటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

చంద్రబాబు బలహీనతను అనుకూలంగా మలుచుకుని రాజకీయ, అధికార లబ్ది పొందిన సోమిరెడ్డి పప్పులు ఈ దఫా ఎన్నికలలో ఉడకవని అధికార ప్రజాప్రతినిధులు అంటున్నారు. గతంలో దివంగత వైఎస్‍.రాజశేఖర్‍ రెడ్డిపైట స్వయంగా విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. రాజకీయంగా ఎదగాలని ఆశపడ్డ సోమిరెడ్డికి సొంత నియోజకవర్గమైన సర్వేపల్లి ఓటర్లు ఎందుకనో సవతి తల్లి ప్రేమ చూపిస్తారని టిడిపి నేతలు, కార్యకర్తలే అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.