Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

రెండేళ్లు గడిచినా కొలిక్కిరాని వివేకా హత్య కేసు..?

ఆ మాజీ మంత్రి సాక్షాత్తు సిఎం జగన్‌ రెడ్డికి స్వయాన చిన్నాన్న.. అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డికి స్వయాన తమ్ముడు. ఆయన హత్య జరిగి రెండేళ్లు పైగా గడిచినప్పటికీ.. ఇంత వరకు హంతకుల ఆచూకీ బయట పడలేదు. ఆయన గుండె పోటు వచ్చి చనిపోయారని.. మొదట్లో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్ర పోలీసులు ఆ హత్యపై విచారణ చేపట్టినా.. ఒక కొలిక్కి రాలేదు. చివరకు ఆయన హత్యపై సిబిఐ విచారణకు న్యాయస్థానం ఆదేశించి కూడా చాలా నెలలు గడిచింది. అయినప్పటికీ.. ఇంత వరకు ఆ మాజీమంత్రిని హత్య చేసిన హంతకులు పేర్లు బయట పడలేదంటే.. ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు అధికారులపై జరుగుతున్నాయో స్పష్టం అవుతోంది.

అసలు విషయానికి వస్తే.. ఆ మాజీ మంత్రి పేరు వైఎస్‌.వివేకానందరెడ్డి. ఆయన ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అలాంటి సమయంలో సిబిఐ డిఐజి సుధాసింగ్‌ను బదిలీ చేయటం పలు అనుమానాలకు తావిస్తుంది. అంతే కాదు డిఐజి ర్యాంకు ఉన్న అధికారిని బదిలీ చేసి ఎస్పీ ర్యాంకు ఉన్న సిబిఐ అధికారికి ఆ బాధ్యతలు అప్పజెప్పారు.

- Advertisement -

ఏమిటి ఇంత గందరగోళం.. ఎందుకు డిఐజిని బదిలీ చేశారు. ఎందుకు ఆ ఎస్పీని నియమించారు అని సిబిఐ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ లేదు.. సాధారణ బదిలీల వలె ఆయా బదిలీలు జరిగాయని.. చేతులు దులుపుకున్నారు. వాచ్‌మెన్‌ రంగయ్యను విచారిస్తున్నప్పుడు సుధా సింగ్‌ అక్కడ లేరని.. చివరకు తన బదిలీ విషయం కూడా ఆమెకు తెలియదని.. వివేకానందరెడ్డి బందువు ఒకరు వెల్లడిరచటం.. గమనార్హం.

రాజకీయ ఒత్తిళ్లతోనే విచారణ మరింత ఆలస్యం కావచ్చునని.. కొత్త అధికారి బాధ్యతలు స్వీకరించాకే ఏ విషయం బయట పడుతుందంటున్నారు స్థానిక పోలీసు అదికారులు. విచారణ మొత్తాన్ని సిబిఐ డిఐజి సుధాసింగ్‌ ఒక కొలిక్కి తెచ్చారని.. అసలు నిందితులకు ఉచ్చు బిగించే లోపల ఆమెను బదిలీ చేసి ఆ బాధ్యతలు మరొకరికి అప్పజెప్పటాన్ని పరిశీలిస్తే.. ఎక్కడో ఏదో జరుగుతోంది.

కేంద్ర హోం శాఖ ఈ విషయంలో సిబిఐ అధికారులపై ఒత్తిడి తెస్తుందన్న అనుమానం కూడా తలెత్తుతుందంటున్నారు. మాజీముఖ్యమంత్రి సోదరుడు.. తాజా ముఖ్యమంత్రి స్వయాన చిన్నాన్న హత్య జరిగి రెండేళ్లు పైగా గడిచినా.. ఇంత వరకు హంతకుల ఆచూకి తెలియకపోవటం.. అనుమానాలు ఉన్నవారిని విచారించకపోవటం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని.. ఆమాజీ మంత్రికుమార్తె బాహాటంగానే వెల్లడిరచారు. వివేకానందరెడ్డి హత్య నిందితుల విషయం రాష్ట్ర పోలీసు అధికారులకు ముందే తెలిసినా.. వారు బయట పడలేదు.

వివేకానంరెడ్డి హత్య వివరాలు సిబిఐ అధికారులకు తెలిసినా వారు ఎందుకో మిన్నకుండి పోయారని విమర్శలు వస్తున్నాయి. వివేకానందరెడ్డి హంతకులు ఎవరో కానీ ఎంతో అదృష్టవంతులు. హత్య చేసినా పట్టుపబడలేదు. ముందు ముందు పట్టుకుంటున్నారన్న నమ్మకంలేదు. అసలు పట్టుబడతామన్న అనుమానే వారికి ఉండి ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave A Reply

Your email address will not be published.