ఊహించని అవతారాల్లో కీర్తిసురేష్, సెల్వరాఘవన్
తెలుగులో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, 7బైజి బృందావన కాలనీ’ వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు సెల్వరాఘవన్ అందరికీ సుపరిచితమే. ఇప్పుడాయన నటుడిగా మారారు. అంతేకాదు ఆయన పక్కన మహానటి కీర్తిసురేష్ నటిస్తుండటం విశేషం. వీరిద్దరూ ప్రధానపాత్రల్లో అరుణ్ మాధేశ్వరణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘సానికాయిదమ్’. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ లుక్‌లో సెల్వరాఘవన్, కీర్తిసురేష్‌లను చూసిన ఎవ్వరికైనా ‘దండుపాళ్యం‘ సినిమా గుర్తురాకమానదు. 1980 నాటి వాస్తవ సంఘటనలతో యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా తెలుస్తుంది.
- Advertisement -
ఇక ఈ ఫస్ట్ లుక్‌లో కీర్తిసురేష్, సెల్వరాఘవన్.. ఇద్దరు కూర్చుని దిగులుగా చూస్తున్నారు. ఇద్దరికీ రక్తం కారుతుంది. అలాగే వారిద్దరి ముందు పలు రకాల కత్తులు ఉన్నాయి. చూస్తుంటే వీరిద్దరూ తమకు అన్యాయం చేసిన వారిని మట్టుబెట్టినట్లుగా కనబడుతోంది. వీరిద్దరినీ ఇలా చూడటం ఆసక్తికరంగా ఉన్నట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు. సేమ్ టు సేమ్ ‘దండుపాళ్యం’ బ్యాచ్లాగే వారి గెటప్స్ ఉన్నాయి. స్ర్కీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.