Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ప్రజల ప్రాణాలు పోతుంటే..?

 గుర్రపు స్వారీ ఆనందాలలో అధికార ఎమ్మెల్యేలు..!

రోమ్‍ నగరం తగలబడిపోతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించారట. ఇందులో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియదు.. కానీ ఎప్పటి నుండో నీరో చక్రవర్తి గురించి ఆ విధమైన ప్రచారం ఉంది. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా ఏపీలో కరోనా వ్యాది దెబ్బకు వందలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు.

- Advertisement -

ఆసుపత్రిలలో చేరేందుకు వెళితే బెడ్‍లు దొరకటం లేదు. ఆరుబయటే రోగులు పడుకుంటున్నారు. ఒకవేళ బెడ్‍లు దొరికితే ఆక్సిజన్‍ అందుబాటులో లేక చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు స్పష్టంగా బయట పడుతున్న నేపధ్యంలో ఇదంతా ఎల్లో మీడియా సృష్టి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‍లు మాపై బురద చల్లుతున్నారని ఎదురు దాడిచేశారు.

కరోనా బారిన పడి వందల మంది ప్రజలు చనిపోతుంటే.. అదికార పార్టీ ఎమ్మెల్యేలు గుర్రపు స్వారీలలో బిజి బిజీగా ఉంటున్నారట. అంటే ఎవరు ఎలా పోతే మాకు ఎందుకు అని ఆ ఎమ్మెల్యేలు సరదాల్లో మునిగి తేలుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఆక్సిజన్‍ అందక 11మంది మృతి చెందిన రుయాకు 60కి.మీల దూరంలో నదిఒడ్డున ప్రభుత్వ చీఫ్‍ విప్‍ గడికోట శ్రీకాంత్‍ రెడ్డి, ప్రభుత్వ విప్‍ కోరుమట్ల శ్రీనివాసులు, కడప మేయర్‍ సురేష్‍బాబులు గుర్రపు స్వారీ చేస్తూ.. ఎంజాయ్‍ చేస్తున్నారని.. మాజీ మంత్రి ట్విట్టర్‍ వేదికగా స్పందిస్తూ..ఆ ముగ్గురిపై నారా లోకేష్‍ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

దీనిని బట్టి ప్రాణాలంటే అటు ప్రభుత్వానికి ఎంత లోకువో గుర్రం మీద నేతల•తా ఉదాహరణ అంటూ లోకేష్‍ తప్పుబట్టారు. సోషల్‍ మీడియాలో ఆ ముగ్గురు గుర్రపు స్వారీ చేస్తున్న దృశ్యాలు ప్రచారం అవుతున్నాయి. తమ నియోజకవర్గ ప్రజలు కరోనా వ్యాది బారిన పడ్డా.. ఆసుపత్రిలలో చేరాలంటే.. ఖాళీ లేక ఒకవేళ ఖాళీ దొరికి బెడ్‍ దొరికితే ఆక్సిజన్‍లేక విలవిలలాడిపోతుంటే.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు గుర్రపు స్వారీ చేస్తూ.. ఆనందిస్తున్నారంటే.. ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి పాలనలో ఎమ్మెల్యేలు ఈ విధంగా ఉంటారా.. అని వామపక్ష నేతలు కూడా దుయ్యబట్టారు.

Leave A Reply

Your email address will not be published.