Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

అంబటి రాంబాబుకు మంత్రి పదవి దక్కేనా..?

ఆ రాజకీయ నేత 30ఏళ్ల నాడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జిల్లాలో అందరికంటే ఆయనే సీనియర్‍. మొదటి నుండి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‍కు అనుచరుడే. దివంగత వైఎస్‍ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఆ నేత ఆయన మరణానంతరం అందరికన్నా ముందుగా జగన్‍ పార్టీలో చేరారు. జగన్‍ రెడ్డికి అనధికార అధికార ప్రతినిధిగా అప్పట్లో ఆయనే ప్రకటించుకున్నారు.

తాను సిఎం జగన్‍ రెడ్డికి అత్యంత విధేయుడనని, త్వరలో తనకు మంత్రి పదవి దక్కటం ఖాయం అని ఆ నేత చెబుతున్నట్లు బయటకు పొక్కింది. కానీ ఏ కారణాలతోనే ఆయనను సిఎం జగన్‍ రెడ్డి ఎక్కువగా పట్టించుకోరని.. అధికార నేతలే అంటుంటారు.తన వాగ్దాటితో తిమ్మిని బొమ్మిశ్రీతీ.. బొమ్మిని తిమ్మిని చేయగల ఆ నేతకు మంత్రి పదవి దక్కుతుందో లేదో అని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాలోకేష్‍లపై విరుచుకు పడుతూ సిఎం జగన్‍ రెడ్డిని ఆకాశానికి ఎత్తివేస్తున్న ఆ నేతకు ముందు ముందు కాలం కలిసి వస్తుందో.. రాదో…? ప్రస్తుత ఎమ్మెల్యేలలో తానే సీనియర్‍ అని కులం కోటాలో తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆ నేత నమ్ముతున్నారు. కానీ సిఎం జగన్‍ రెడ్డిని ఆ నేత కలవాలంటే రోజుల సమయం పడుతుందని.. ఆయనను కలిసేందుకు సిఎం జగన్‍రెడ్డి సమయం ఇవ్వటం లేదని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

మా నేతకు మంత్రి పదవి దక్కబోతుంది అందుకే ఈర్షాద్వేషాలతో కొందరు అధికార పార్టీ నేతలే ఆ ప్రచారం చేయిస్తున్నారని ఆ నేత అనుచరులు అంటున్నారు. కొంతమంది తెలుగుదేశం నేతలతో ఆ నేతకు పరోక్ష సంబందాలతో పాటు వ్యాపార బాగస్వామ్యం కూడా ఉందని..ఆ నేత బండారం సిఎం జగన్‍ రెడ్డికి తెలుసునని అధికార ప్రజాప్రతినిధులు తెర వెనుక అంటున్నారు.

ఎప్పుడో దక్కాల్సిన మంత్రి పదవి ఇప్పటి వరకు దక్కకపోవటంతో మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా.. తనకు మంత్రి పదవి దక్కటం ఖాయమన్న ధీమా ఆ నేతలో కనిపిస్తుంది. మీడియా సవవేశంలో సిఎం జగన్‍ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతూ విపక్ష నేతలపై బురద చల్లటంలో ఆ నేతకు ఉన్న అనుభవం మరెవరికీ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ నేత ఎవరంటే గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

ఏ స్థాయి నుండి రాజకీయ జీవితం ప్రారంభించారు. ప్రసుతం ఏ స్థాయిలో ఆయన ఉన్నారు. అంబటి భాగోతం అంతా సిఎం జగన్‍ రెడ్డికి తెలుసు. రాంబాబుకు మంత్రి పదవి ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు తెర వెనుక అదికార పార్టీ ప్రతినిధులు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో అంబటి రాంబాబు సామాజికవర్గానికి చెందిన మెజార్టీ ఓటర్లు ఉన్న నేపధ్యంలో అంబటి రాంబాబుకు మంత్రి పదవి తప్పకుండా ఇస్తారని.. కొంతమంది రాజకీయ ప్రతినిధులు తెర వెనుక అంటున్నారు.

అంబటి రాంబాబుకు అదృష్టం కలిసి వచ్చి మంత్రి పదవి సాధించారు. ఆయనకు మంత్రి యోగం లేదు.మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. అంబటికి అపజయం తప్పదంటున్నారు ఆయనంటే గిట్టని అధికార పార్టీ నేతలు. కులం కోటా, రాజకీయ సీనియార్టీతో పాటు, విధేయతను సిఎం జగన్‍ రెడ్డి పరిగణనలోకి తీసుకుని తనకు మంత్రి పదవి ఇస్తారన్న నమ్మకంతో రాంబాబు ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి

Leave A Reply

Your email address will not be published.