Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మాజీ మంత్రులను చంద్రబాబు దూరం పెట్టనున్నారా..?

గత ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు మళ్లీ ఎన్నికల నాటికి కొత్త తరాన్ని తెరపైకి తీసుకు వచ్చి పాత తరానికి చెందిన పాత నాయకులందరినీ.. క్రియాశీలక రాజకీయాలకు దూరం పెట్టాలని.. నియోజకవర్గాలలో వారి పెత్తనానికి పులిస్టాప్‍ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. అలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకోగలరా..? మాజీ మంత్రులను క్రియాశీలక రాజకీయాల నుండి తప్పించగలరా..? అంత కఠిన నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకోగలరా.. అనే అనుమానం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

మాజీ మంత్రులు అశోక్‍గజపతి రాజు, యనమల రామృష్ణుడు, పితాని సత్యనారాయణ, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‍ రెడ్డి, ఎన్‍.అమరనాధ్‍ రెడ్డి, కేఈ.కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు లను నియోజకవర్గాలలో వారి పెత్తనం చేయకుండా నామినేటెడ్‍ పోస్టులకే చంద్రబాబు పరిమితం చేయగలిగితే.. పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడుతుందంటున్నారు టిడిపి నేతలు.

- Advertisement -

పూసపాటి అశోక్‍గజపతిరాజు, యనమల రామకృష్ణుడులను చంద్రబాబు వదులుకోలేరు. అలాగే సోమిరెడ్డిని, అమరనాధ్‍ రెడ్డిలను కూడా అయిష్టంగానే భరిస్తారు. ఈ విషయంలో చంద్రబాబుకున్న బలహీనతలే ఆ నలుగురుకి కాలం కలసి వచ్చింది అంటున్నారు మాజీ మంత్రులు. పైన ఏర్కొన్న మాజీ మంత్రులలో ఒకరిద్దరు మినహా మిగతా వారందరిపై ప్రజలలో తీవ్ర వ్వతిరేకత వ్యక్తం అవుతోంది.

కార్యకర్తలు కూడా వారిని పట్టించుకోవటం మానివేశారు. కుటుంబ సభ్యులకు అధికార పెత్తనం అప్పజెప్పి.. అప్పట్లో ప్రభుత్వాన్ని, పార్టీని మంత్రులు భ్రష్టుపట్టించారని.. చంద్రబాబుకు కూడా తెలుసు. ముఖ్యంగా మాజీ మంత్రులను రాజకీయంగా తప్పించాలని.. యువతరాన్ని ప్రోత్సహించాలని.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తెర వెనుక మీడియా ప్రతినిధులతో చెప్పటం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పార్టీ పూర్తిగా భూస్థాపితం కావటానికి మాజీ మంత్రి సోమిరెడ్డే కారణమని తెలిసినా.. చంద్రబాబు ఇప్పటికీ సోమిరెడ్డిపైనే ఆధార పడుతుండటంతో మిగతా నాయకులకు మింగుడు పడటం లేదు.

ఇలాంటి పరిస్థితులు స్పష్టంగా ఎదురువుతున్న నేపధ్యంలో చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే.. ముందు ముందు పార్టీ పరిస్థితి కష్టం అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, అశోక్‍ గజపతి రాజు, పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎన్‍.అమరనాధ్‍ రెడ్డిలను తప్పనిసరిగా క్రియా శీలక రాజకీయాలకు చంద్రబాబు దూరం పెడితే.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో అటు పార్టీ సానుభూతిపరులలో, కార్యకర్తలలో.. ఉన్న వ్యతిరేకత, అసంతృఫ్తి పూర్తిగా తగ్గటం ఖాయమంటున్నారు పార్టీ సీనియర్‍ నేతలు.

 

 

Leave A Reply

Your email address will not be published.