Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఎస్‍ఈసి పదవి నుండి నీలం సహాని తప్పుకోనున్నారా..?

ఏ ముహుర్తాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని నియమితులయ్యారో కానీ అప్పటి నుండి ఆమె పనితీరుపై మీడియాలో రకరకాలుగా కధనాలు ప్రచారం అయ్యాయి. కేవలం ఆరు నెలలు సర్వీసు ఉన్న నీలం సహానిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించటమే కాకుండా.. మరో ఆరు నెలలు ఆమె సర్వీసును పొడిగించారు సిఎం జగన్‍ రెడ్డి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంవత్సరం పాటు బాధ్యతలు నిర్వహించిన నీలం సహాని అనేక విమర్శలు పాలయ్యారు.

ప్రభుత్వ ఆదేశాలను గుడ్డిగా పాటించటమే కాకుండా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టుకున్న విలువ ఆమె హయాంలోనే తగ్గిందని పలువురు అధికారులు తెర వెనుక చెప్పటం జరిగింది. ముఖ్యమంత్రి సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్న నీలం సహానినే స్థానిక సంస్థల ఎన్నికల కమీషనర్‍గా సిఎం జగన్‍ రెడ్డి సిఫార్సుతో గవర్నర్‍ ఆమోద ముద్ర వేసిన విషయం విధితమే. ఎన్నికల కమీషనర్‍గా బాధ్యతలు స్వీకరించిన రోజునే వాయిదా పడ్డ ఎంపీటీసి, జడ్పీటిసి ఎన్నికలకు పది రోజులలో నిర్వహించేందుకు ఆమె నోటిఫికేషన్‍ జారీ చేయటంపై న్యాయస్థానం తప్పుపట్టడమే కాకుండా.. ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సర్వీసు నుండి రిటైర్డు అయ్యారు.

- Advertisement -

ఆమెకు ఆంగ్ల భాషపై బాగా పట్టుంది. సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా.. ఏక పక్షంగా ఆమె నిర్ణయం తీసుకుని ఎన్నికలు జరిపించారు. ఆ కారణంతో ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ విధంగా పరువు పోగొట్టుకునే పరిస్థితి అనేక సందర్భాలలో ఎదురు కావటంతో స్వచ్చందంగా పదవి నుండి తప్పుకోవాలని నీలం సహాని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నీలం సహాని భర్త అజయ్‍ సహాని ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఒకవైపు కుటుంబానికి దూరంగా ఉండటం.. మరో వైపు లేనిపోని తలనొప్పులు ఎదురవుతున్న నేపధ్యంలో స్థానిక సంస్తల కమీషనర్‍ పదవి నుండి తప్పుకోవటమే మంచిదని.. నీలం సహాని తన సన్నిహితులతో చెబుతున్నారని బయటకు పొక్కింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్డు అయ్యాక నీలం సహానిని ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించారని.. ఆమె ఆపోస్టులో బాధ్యతలు నిర్వహిస్తుండగానే.. నిబందనలకు విరుద్దంగా నీలం సహానిని స్థానిక సంస్థల ఎన్నికల కమీషనర్‍గా నియమించారని.. ఆ నియామక0 చెల్లదని.. న్యాయస్థానంలో పిటిషన్‍ దాఖలు అయింది.. హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టి అటు ప్రభుత్వానికి కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. జూన్‍ 29వ తేదీకి వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.