Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మాజీ మంత్రికి క్లాస్‍ పీకిన జగన్‍..!

మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‍ చంద్రబోస్‍ వ్యవహారశైలిని, ఆయన చేసిన వ్యాఖ్యలను, విమర్శలపై ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా.. ఆయనకు తలంటు పోశారని.. పెద్ద క్లాస్‍ కూడా పీకారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం బాహాటంగా బయట పడనప్పటికీ.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మాజీ మంత్రి సుభాష్‍ చంద్రబోస్‍ను తూర్పుగోదావరి రాజకీయాలలో తనదే పై చేయిగా ఉండాలని కోరుకుంటున్నారన్న విషయం బయట పడటంతో.. సిఎం జగన్‍ రెడ్డి పిల్లిని తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‍రెడ్డిపై బాహాటంగా, పరోక్షంగా పిల్లి సుభాష్‍చంద్రబోస్‍ విమర్శలు, ఆరోపణలతో పాటు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తుండటతో.. కొన్ని రోజులు మౌనం వహించిన ద్వారంపూడి ఆ తరువాత పిల్లిపై తిరుగుబాటు చేశారు. వైఎస్‍ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా ద్వారంపూడికి పేరుంది. ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి కూడా కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్‍ రెడ్డిని మిగతా వారి కన్నా ఎక్కువ గౌరవిస్తారు. అభిమానిస్తారు. ఆదరిస్తారు.

- Advertisement -

2019 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన బోస్‍ ఓడిపోయినప్పటికీ… సామాజికవర్గాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఆతరువాత రాజ్యసభ సభ్యుడిగా కూడా జగన్‍ రెడ్డి ఎంపిక చేశారు. సామాజికవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రశేఖర్‍ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు జగన్‍. ఎప్పుడైతే ద్వారంపూడిపై పిల్లి విమర్శలు, ఆరోపణలు చేశారో.. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్‍ బోస్‍ను పిలిపించి చివాట్లు పెట్టారు. స్వయంగా వెళ్లి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిని కలవమని ఆదేశించారు. చేసేది ఏమీ లేక పిల్లి స్వయంగా కాకినాడ ఎమ్మెల్యే ఇంటికివెళ్లి కలిసి ఆయనతో మాట్లాడారు. ద్వారంపూడితో బోస్‍ ఏం మాట్లాడారన్న విషయం బయట పడలేదు. ఆ తరువాత పిల్లి మౌనం వహించారు. దీనిని బట్టి కాకినాడ ఎమ్మెల్యేపై సిఎం జగన్‍ రెడ్డి ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నారని స్పష్టమయింది. అసలు విషయం తెలియని రాజ్యసభ సభ్యుడు పిల్లి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సిఎం జగన్‍ రెడ్డి చివాట్లు పెట్టాక అసలు విషయం బోధ పడింది. ఆ తరువాత ద్వారంపూడిని కలిశారు. అక్కడ ఏం జరిగిందో కానీ బోస్‍ మౌనం వహించారు.. ద్వారంపూడి మీసం మెలేశారు అన్నట్లుగా ప్రచారం జరుగుతంది.

Leave A Reply

Your email address will not be published.