Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

అధికార సోషల్‍ మీడియా హిట్‍.. టిడిపి సోషల్‍ మీడియా ప్లాప్‍ అయిందా..?

సొమ్ము పోయినా శని పట్టిన పరిస్థితులు ఏ విధంగా కొందరికి ఎదురవుతాయో.. అలాగా రాజకీయ పార్టీల తరపున సోషల్‍ మీడియా నిర్వహిస్తున్న తీరును బట్టి సొమ్ము పోయినా అందుకు ప్రతిఫలం దక్కటం లేదని.. టిడిపి ముఖ్యనేతలు వాపోతుండగా.. సొమ్ములు పోయినా.. పరవాలేదు.. తాము కోరుకున్నది జరుగుతుందని.. అధికార సోషల్‍ మీడియా నిర్వహిస్తున్న వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆ విధంగా అదికార సోషల్‍ మీడియా నిర్వహిస్తున్న వారు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ఇటు టిడిపి తరపున సోషల్‍ మీడియా నిర్వహిస్తున్న తీరును ఆ పార్టీ ముఖ్య నేతలు తప్పుబడుతున్నా.. మాజీ మంత్రి నారా లోకేష్‍ ఆశీస్సులు తమకున్నాయన్న.. ధీమాతో టిడిపి సోషల్‍ మీడియాలో పనిచేస్తున్న కొంతమంది ప్రబుద్దులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికార సోషల్‍ మీడియాకు ధీటుగా టిడిపి సోషల్‍ మీడియా నిర్వాహకులు నిర్వహించలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

అధికార సోషల్‍ మీడియాలో పనిచేస్తున్న వారు కులాభిమానంతో విధేయతగా పనిచేస్తుండగా.. టిడిపి లో పనిచేస్తున్న వారిలో పార్టీకి విధేయులు ఎందరో.. పక్కన పెడితే.. కుల వ్యతిరేకత ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేయటంలో టిడిపి సోషల్‍ మీడయా నిర్వాహకులు ఘోరంగా విఫలం అయ్యారని టిడిపి నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సొంతంగా సోషల్‍ మీడియా విభాగాన్ని నిర్వహిస్తున్న అటు జగన్‍ పార్టీ నేతలు, ఇటు తెలుగుదేశం నేతలు తెర వెనుకుండి ఈ తతంగం నడిపిస్తున్నా.. అధికార సోషల్‍ మీడియా సూపర్‍ డూపర్‍ హిట్‍ అయిందని.. టిడిపి సోషల్‍ మీడియా అట్టర్‍ ప్లాప్‍ అయిందని.. ఆయా పార్టీల నేతలే తెర వెనుక చెబుతున్నారు. చంద్రబాబు, లోకేష్‍లపై వ్యతిరేక వార్తలను అధికార సోషల్‍ మీడియా ఎంతో హడావిడితో ప్రచారం చేస్తూ.. జనంలోకి తీసుకెళుతుంటే.. టిడిపి సోషల్‍ మీడియా అందుకు బిన్నంగా ముందుకు వెళుతుందని జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయంటున్నారు.

చంద్రబాబు, లోకేష్‍లపై వ్యతిరేక వార్తలను అధికార మీడియా చేస్తున్న ప్రచార వేగానికి టిడిపి సోషల్‍ మీడియా విభాగం తట్టుకోలేకపోతుంది. టిడిపి సోషల్‍ మీడియాలో పనిచేస్తున్న వారు కేసులకు భయపడుతున్నారు. ప్రతిఫలం బాగానే పొందుతున్నా వారిలో జగన్‍ పార్టీ సోషల్‍ మీడియాలో విధేయత•గా పనిచేస్తున్నా.. టిడిపి సోషల్‍ మీడియా విధేయతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదికార సోషల్‍ మీడియాను తెర వెనుకుండి సలహాదారుడుతో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరి కొంతమంది జగన్‍ విధేయులు ఎప్పటికప్పుడు నిర్వహిస్తుండగా.. టిడిపి సోషల్‍ మీడియాను అంత పకడ్భందీగా నిర్వహించే వారు కనిపించటం లేదు

Leave A Reply

Your email address will not be published.